Harianiketh M

Others

4  

Harianiketh M

Others

ప్రేమప్రయణం}

ప్రేమప్రయణం}

3 mins
290


ఉయ్యాలో పిల్లాడిని పెట్టి ఊరంతా తిరిగినట్టు...కొన్ని బంధాలు విచిత్రంగా కలుస్తాయి..కొత్తగా వశిష్ట అపార్ట్మెంట్స్ లోకి వచ్చేరు వైనతి,సుగమ్ ల జంట..అత్త,అమ్మ జంటలు కూడా వచ్చాయి.కొన్ని రోజులు ఉండి,మంచి చెడులు చెప్పి పోదాం అనుకుని.

నేను ఇవ్వాళ సెలవుపెట్టుకుని,మిమ్మల్ని ఊరంతా తిప్పుతాను అమ్మా.మన వాసు మావయ్యా కొడుకు ఇక్కడే ఓ కాలేజీలో లెక్చలర్గా చేస్తున్నాడు..వాడ్ని ఓ వారంరోజులు కారు ఇమ్మన్నాను.సరే!అన్నాడు.వెళ్లనా! అమ్మని అడిగేడు.

నీకు పెళ్లి చేసి,కోడల్ని తెచ్చుకోవడంతో మాపని అయిపోయిందిరా సుగమూ..ఇంక నువ్వూ నీ పెళ్ళాం చూసుకోండి ఏదయినా!మాకు రెస్టు కావాలిరా రెండు రోజులు.అవునా! వదినా అడిగింది...వియ్యపురాలు ఏమంటుందో అని.

నిజమే!వదినగారూ నేనయితే ఎక్కువరోజులు కూడా ఉండలేను..ఒకటే రొద..ఊళ్ళో లా గేదెలు,అవులూ అరుపు వినకపోతే ..మనసు కుదురుండదు.ఈయన చుట్టముక్క ఎక్కడ దొరుకుతుంది? అనిఅప్పుడే బాధ మొదలైంది..

నేను తెచ్చాలే అమ్మా! వైనతి మాటకి భయపడుతూ,

వీపరాలు కేసి చూసింది ఆమెతల్లి.

సుగమ్ తుళ్ళిపడ్డాడు ఆమాటకి.అమ్మ ఏమంటుందో? బెరుగ్గా చూస్తున్నాడు.నీకు బుద్దిలేదు గోణికేడు భార్యకి మాత్రమే వినిపించేలా.

మంచిపని చేసావులే కానీ,అందులోంచి ఓ రెండు పీకలు మీ మావయ్యకి కూడా ఇవ్వు.నేను తెచ్చానని చెప్పు.నీ గొప్ప చెప్పకు.. అంది అత్త...

అమ్మయ్యా అనివూపిరిపీల్చుకున్నాడు..ఇద్దరూ బావామరదళ్లే!కానీ చుట్టరికం భర్తవైపు నుంచి.అందుకని అపుడపుడూ విరుస్తుంది మాటల్ని అత్త.

ఇలానే కాలేజీలో నా పరువు తీసింది..వైజాగ్ గీతమ్స్లో ఎంబీఏ ఫైనల్ చేస్తుండగా..ఈవిడ ఇంజినీరింగ్లో జాయిన్ అయింది..

అమ్మ నోటికి భయపడి ,నాన్న నాతో మాత్రమే చెప్పిన విషయం..ఈ ఊరిలోనే నీ మరదలు వుందని.నువ్వు దాన్ని కాలేజీలో జాగ్రత్తగా చూసుకోవాలని.

మీరు సుగమ్ ఏనాండీ,!వెనకనుంచి వినబడిన మాటకి,తిరక్కుండానే

ఆయ్!అవునండీ..మీకు ఏం కావాలండీ? సమాధానం

చేప్పేడు..

మా మావయ్య మీతో మాట్లాతారంటండీ.లైనులో ఉన్నారు అంటూ,ఇటు తిరగకపోయేసరికి వీపుమీద చరిచింది..మిమ్మల్నే! అవతల పెద్దాయన లైన్లో ఉంటే,అలా అటుతిరిగి కూచుంటారేటి మీరు అంటూ.

నీ..అంటూ చివాల్న వెనక్కి తిరిగి,ఏంటమ్మా ! నీ గోల అడిగేడు కోపంగా.

మా మావయ్యగారు మీతో మాట్లాతారంట..మొహం కందిపోయింది అవమానానికి.

మీ మావకి నాతో పనేంటి? అసలు ముందు నువ్వెవరో చెప్పు.న్యూ జాయిన్ కదూ& ఇదో స్టైలా రాగింగ్లో..పోలీసు మఫ్టీలో ఉంటారు ఇక్కడ.జాగ్రత్త..పో! ఇక్కడనుంచి అరిచేడు గట్టిగా

మీరూ తెలీదంట మావయ్యా..పో అంటున్నారు ఏడుస్తోంది అని,ఇలారా!అన్నాడు

పరుగుతో వచ్చి,ఫోన్ చేతిలో పెట్టేసింది.హాలో..హలో...సుగమ్..నాన్నా సుగమ్..స్పీకర్ ఆన్ అయి,మాటపైకి వినిపిస్తుంది..

పిలుపు నాన్నదిలా ఆనిపించడంతో,నాన్నా మీరేనా?అడిగేడు

అవును నేనే సుగమ్! ఆ అమ్మాయి మీ లక్ష్మీఅత్తయ్య కూతురు..చాన్నాళ్ళకి మళ్లి కలిసేరు.ఆ! విషయాలు తరువాత.తన అడ్మిషన్ సంగతి చూడు కొంచెం.సిటీ కి కొత్త.హాస్టల్ లో ఉంటుంది.వెళ్లరా..తరువాత ఈ విషయం అమ్మకి చెప్పొద్దు.ఎదో ఊహించేసు

కుంటుంది..సరేనా ఫోన్ కట్ అయింది..

ఏదీ అమ్మాయి! చుట్టూ చూసేడు.ఎవరో అబ్బాయితో మాట్లాడుతూంది.

ఈ అబ్బాయినీకు తెలుసా?

అబ్బే!తెలీదండి.ఓమాటు గ్రౌండ్లోచుట్టూ తిరిగి టైము ఎంతపట్టిందో చెప్పంటున్నాడు.నాకు డేట్ టైము,ఇపుడు కుదరదు అన్నానండి..

ఎవరితో అని అడుగుతున్నాడు..మీరు వచ్చేరు.

అంతేనండి.ధైర్యం అనిపించి సుగమ్ పక్కకి చేరింది.

మీకు తెలుసా బాస్..అలా అయితే ఓకే అంటూ వెళ్ళిపోయేడు అతను.

వాడు ఏమన్నాడో తెలుసా?నవ్వు ఆపుకోలేక

పోయాడు సుగమ్.

పాపం?అక్క చెల్లి లేరేమోనండీ!నేను చెప్పింది అర్థం కాలేదు.వాణ్ణి క్షమించేసేను అన్నట్టు ఆ విషయానికి స్వస్తి చెప్పింది.

నేను నీకు బావ అవుతాను తెలుసా అన్నాడు సుగమ్.

మావయ్య ముందే చెప్పేరండీ.జాగ్రత్తగా ఉండు బావతో కొంచెం...ఆగిపోయింది

అంటే...కొంచెం రెట్టించెడు ఆశక్తితో

అత్తయ్యతో డేంజర్ అని మాత్రం అన్నారు.ఆపైన ఎం చెప్పలేదు ..

జాయినింగ్ అయి,హాస్టల్ రూంలో దిగబెట్టి,నెంబర్ తీసుకో అన్నాడు.

అబ్బే!ఏమైనా పనుంటే మావయ్యకి చెబుతాను.ఆయన మీకు చెప్తారు.బాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.ఇంక ఊరికే నా వెనక్కాల తిరగకుండా బాగా చదువుకోండి..

నేను పనోడిలా కనిపిస్తున్నానా మీకు ,ఇంటికి వెళ్తూనే తండ్రిపై యుద్ధం ప్రకటించేడు.

నా పరువు కాపడరా..అనడంతో ఊరుకున్నాడు.

సుగమ్ చదువు అయిపోయింది.ముంబైలో ఉద్యోగానికి వెళ్ళేడు.జాబ్ చూస్తారా నాకు అంటూ వాట్సప్ మెసేజ్ వచ్చింది.

బయోడేట చూసి,ఎం తిక్కగా ఉందా?మెసేజ్ పంపేడు.

మా అమ్మ ఎవరినో చూసింది.వాళ్ళు ఎవరో,ఎక్కడో నసన్ను చూసి,ఇష్టపడ్డారట.నేను లేకపోతే నీ జీవితం శూన్యం అయిపోతుంది బావా.కొంచెం నీ గురించికూడ సులోచించుకో...తరువాత నీ ఇష్టం పెట్టేసింది..

వారంపాటు ఫోన్ చెయ్యలేదు, తీయ్యలేదు..కోపం హద్దు దాటుతుంటే..నెలరోజులు సెలవుపెట్టుకుని యింటికి వచ్చేడు.

ఆశ్చర్యం..ఓయ్!రా బావా! లోపలికి అంటూ తలుపు తీసింది వైనతి.నువ్విక్కడ..

నేనే రమ్మన్నాను.నీకు తిక్క కుదురుద్దామని.ఎన్నాళ్ళు పెళ్లి చెసుకోకుండా..ఎవత్తో గురించి నువ్వు ఏడవడం ఎందుకురా?నీకేం ఖర్మ.సొంత అత్త కూతురు బంగారం,లచ్చిందేవిలా ఉండగా..ఆపై నీకు ఇష్టమైంది చేసే నేనుండగా

ఏమిటీ నాన్నా..సైగ చేసేడు..

లోపలికి తీసుకెళ్ళేడు..నాకు వైనతి కోడలిగా కావాలి.దానికి నువ్వు కావాలట.మొన్నీమధ్యే చెప్పిందీ.మాకు అన్నీ కుదిరినియ్యి.అమ్మకి మంచి కట్నం కూడా..నీకు ఎం కావాలో తెలియలేదు.అందుకే అమ్మాయిని అలా ఫోన్ చెయమన్నాను.

మీ అందరికన్నా నేనే ముందు ఫిక్స్ అయ్యేను.ఆవిడేమా ఆవిడని..ఉద్యోగం కోసం దూరం వెళ్లేను కానీ నేను ఇక్కడే ఉన్నాను నాన్న.

ఏమంటున్నాడు మీ ఉద్దారకుడు..ఎవరో బయటి ఆస్తికన్నా,మనది అన్నది నయం,భయం కూడా వుండదు.

ఏడుస్తున్నాడు అంటూ మోచేతితో కొడుకుని తగులుతూ హింట్ ఇచ్చేడు..

ఓసే!మట్టిముద్దా నీ మొగుడికి ఎం సర్దిచెప్పుకుంటావో చెప్పుకో ఆర్డర్ వేసింది అత్త.పరిగెత్తుకుంటూ వచ్చి ఆజ్ఞ అన్నట్టు నిల్చుంది.

ఫొ!మొగుడు బాధ తెలుసుకోవడం కూడ రాదు ఈ తరం పిల్లలకి..మా ఆయన అత్తయ్యగారూ పోయి ఏడుస్తుంటే..మనిషిని చేసుకోవడానికే ఏడాది పట్టింది వదినా..మీరు లేరుగా మీకు తెలీదులే!

కిసుక్కుమన్నాడు గోపాలం.అలా మా తెయ్యమ్మ నా జీవితంలోకి వచ్చింది..మా సంసారం సిటీలో ఆపార్టుమెంట్కు మారింది.మావయ్యది చిట్ఫండ్ కంపెనీ,చిన్నదేకానీ మంచి పేరుంది.దాన్ని చూసుకోండి అల్లుడూ అన్నారు.ప్రస్తుతానికి నా సొంతకాళ్లమీద బావుంది.తరువాత చూద్దాంలే అన్నాను..



Rate this content
Log in