STORYMIRROR

Dh Yogi

Children Stories Classics Children

4  

Dh Yogi

Children Stories Classics Children

పావురం చీమ కథ

పావురం చీమ కథ

1 min
356


చీమ పావురం కథ మన అందరికీ తెలుసు...!


ఇదే కథ మహాభారత కాలంలో జరిగి వుంటే...!!


ఎలా వుంటుంది ..?


సరదాగా(ఎడిట్ ఊహా)


ఓ చీమ చెట్టు కింద పుట్టలో నివసిస్తుంది.


ఆహారం కోసం


చీమ చెట్టుని ఎక్కింది 


చెట్టు కింద దాదాపు వందకు పైగా పిల్లలు ఆడుకుంటున్నారు.


వారి అల్లరి చూస్తూ చీమ పట్టు తప్పి పక్కనే ఉన్న సరస్సులో పడిపోయింది. 


చీమకి ఈత రాకపోవడంతో నీళ్లలో ఈదలేక నాన అవస్థ పడింది.  


అదంతా గమనిస్తున్న ఒక పావురంకు జాలి కలిగింది. 


సహాయం చెయ్యాలి అనుకుంది. 


చెట్టు మీద నుండి ఒక ఆకు తెంపి ఆ చీమకు దగ్గరగా వేసింది.


 చీమ ఆ ఆకు మీదకి ఎక్కి ఒడ్డుకు చేరుకుంది. 


బ్రతికి బయట పడటంతో సహాయం చేసిన పావురంపై అభిమానం కలిగింది


మనసులో పావురానికి కృతజ్ఞత చెప్పుకుంది.


కృతజ్ఞత చెప్పడానికి చెట్టు దగ్గరికి బయలు దేరింది.


సరిగ్గా అప్పుడే ఓ బాలుడు పావురం వైపుగా విల్లు ఎక్కుపెట్టాడు.  


ఇది గమనించిన చీమ వెంటనే ఆ బాలుడిని సమీపించింది.


అతని కాలును కుట్టింది.


 బాలుడి దృష్టిని మలిచటనికి ప్రయత్నించింది.  


ఈలోపు ఆ పావురం తప్పించుకుంటుందని చీమ ఆలోచన....!


కానీ....!!


చీమ కుట్టగనే ఆ బాలుడు నొప్పితో అరవలేదు కనీసం ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడి ఏకాగ్రతతో బాణం వదిలాడు.


బాణం దూసుకు వెళ్ళి పావురంలో దిగబడింది.


తన జీవితాన్ని కాపాడిన పావురాన్ని చంపినందుకు చీమకు కోపం వచ్చింది.


కసి తీరా మరో నాలుగు సార్లు బాలుడిని కుట్టింది.


పావురం నేలపై పడగానే బాలుడికి చీమ కుట్టిన నొప్పి తెలిసి వచ్చింది ఎడమ చేతితో ఒకే ఒక దెబ్బ వేశాడు 


"చాట్..."మన్న శబ్ధం తో పాటు చనిపోతున్న చీమ అరుపు వినిపించింది"ఎవరీ బాలుడు.... మొండి వాడు "


బాణం తాలూకు దెబ్బకి గాయపడిన పావురం సమాధానం ఇచ్చింది


"అతని పేరు అర్జునుడు"


🤣🤣🤣




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్