Neelima M

Children Stories Drama Romance

4.7  

Neelima M

Children Stories Drama Romance

క్లారాబెల్

క్లారాబెల్

1 min
659



అనగనగా అరికోత్సో అనే రాజ్యంలో క్లారా అనే యువరాణి వుండేది. ఆమె చాలా అందంగా వుండేది. అందరితో స్నేహంగా వుండేది. పేదవారిని చాలా జాలిగా చూసేది.ఆ రాజ్యం లోనే మియాటో అనే అబ్బాయి కూడా ఉన్నాడు. అతడు క్లారా కి మంచి మిత్రుడు.క్లారా లాగానే అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు.                  ఆ రాజ్యం లోనే ఒకారి అనే మంత్రగత్తె వుండేది. ఆమె క్లారా ని చంపడానికి చూసేది. చాలా ప్రయోగాలు చేసేది. కానీ క్లారా మియాటో తో కలసి వాటిని ఎదురుకుని తిప్పి కొట్టేది.                         పక్క రాజ్యం సయాగర్ లో హోబిన్ అనే యువరాజు వున్నాడు. అతనికి ప్రతిరోజు రాత్రి కలలో ఒక యువరాణి కనిపించేది. కలలో కనిపించినట్టుగానే యువరాణి బొమ్మను గీశాడు. తనని వెతకమని రాజ్యం లో వున్నవారికి చెప్పాడు. ఆ చిత్రాన్ని చూసిన హోబిన్ స్నేహితుడు జ్యార్జ్ తనకి ఆ యువరాణి తెలుసు అని చెప్పాడు. వెంటనే ఇద్దరూ ఆరికోత్సో కి బయలుదేరారు.                                   ఒకారీ మళ్ళీ క్లారాని చంపడానికి ప్రయత్నించిoది. వాళ్ళ తల్లిదండ్రులని చంపేసింది క్లారా ని చంపేందుకు వెల్తూ మంత్రం సందించేలోపే హాబిన్ అక్కడికి వచ్చి ఒకారి ని అడ్డుకున్నాడు. పాములతో కాపలాగా వుంచిన పెట్టెలో వున్న బెల్ ని విరగకొడితే గానీ మంత్ర గత్తె చావదని తెలిసి ఆ గంటని తీసుకుందామని వెళ్తాడు కానీ పాములు తీసుకొనివ్వవు. అప్పుడే తనకి కలలో వచ్చిన ఇంకో విషయం గుర్తొస్తుంది. 

            క్లారా వేసుకున్న లాకెట్ లో వున్న మంత్రం పాములను మాయం చేస్తుంది. వెంటనే క్లారా లాకెట్ తీసుకుని మంత్రం చదువుతాడు అప్పుడు పాములు మాయమవుతాయి. వెంటనే ఆ గంటని తీసుకుని విరగకొట్టేస్తాడు. అంతే వెంటనే చనిపోతుంది. మంత్రగత్తెను ఆ గుహలో వుంచేసి తిరిగి రాజ్యానికి తిరిగి వచ్చేస్తారు. 

            హోబిన్ క్లారాని పెల్లి చేసుకుంటాడు.బెల్ లోని ప్రాణాన్ని చంపారు గనుక క్లారా క్లారాబెల్  గ మారింది.హోబిన్ క్లారా ని సాయాగర్ కి తీసుకువెళ్తాడు. కలలో వచ్చిన అమ్మాయి నే పెళ్లి చేసుకున్నందుకు ఆనందించాడు.హొబిన్, క్లారాబెల్ సంతోషంగా జీవించసాగారు. 


Rate this content
Log in