Sadhana B

Children Stories Inspirational Others

4.5  

Sadhana B

Children Stories Inspirational Others

ఇద్దరు అన్నదమ్ముల కథ.

ఇద్దరు అన్నదమ్ముల కథ.

2 mins
1.7K


అనగనగా ఒక ఊర్లో ఒక పేద కుటుంబం ఉండేది ఆ కుటుంబం లోని వారందరూ తీవ్ర దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేవారు.

ఆ కుటుంబంలో ఇద్దరు కుమారులు జన్మించారు కొన్ని సంవత్సరాల తర్వాత వారిని పాఠశాలలో చేర్పించారు వారిలో కేవలం చిన్న పిల్లవాడు చదువుకు తగినంత సమకూరేది కాబట్టి పెద్ద వాడిని చదువు ఆపేసారు.


రోజులు గడుస్తున్నాయి కానీ చిన్న వాడు చదువులో ఎలాంటి మార్పు కనిపించలేదు వాడు చదువులో వెనకబడి ఉండేవాడు కాబట్టి వాళ్ళు పెద్దవాడిని మళ్ళీ చదువుదామని ఆలోచనల్లో ఉండగా వారి తండ్రి గారి మరణం సంభవించింది కావున ఇద్దరు చదువు ఆగిపోయింది. పెద్దవాడు చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. కాబరి ఇంటిి వద్దనే వారి గురువు గారు చదువ చెప్పేవారు.

 వారు ఒక సరుకుల దుకాణాన్ని ప్రారంభించారు. అందులో అన్నయ్య లెక్కలు చూస్తూ ఉండేవాడు తమ్ముడు సరుకులు వచ్చిన వారికి అందిస్తూ ఉండేవాడు. ఒకరోజు తమ్ముడి స్నేహితుడు ఇలా అన్నాడు.

నువ్వు రోజంతా కష్టపడి పని చేస్తూ ఉంటావు కానీ మీ అన్నయ్య తాపీగా కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు ఇది నీకు చాలా అన్యాయం జరుగుతుంది నీవు ఈ పని వదిలేసి వెళ్లి అక్కడ కూర్చొని మీ అన్నయ్య చేసే పని చెయ్యి.


ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య చాలా గొడవ జరిగింది తర్వాత తమ్ముడి పై ప్రేమతో అన్నయ్య ఒప్పుకున్నాడు మరుసటి రోజు అన్నయ్యస్థానంలో తమ్ముడు కూర్చొని లెక్కలు చూస్తున్నాడు తమ్ముడు స్థానంలో అన్నయ్య సరుకులు వచ్చినవారికి ఇస్తూ ఉంటాడు .కానీ సరుకులు ఇవ్వడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది .లెక్కల ఇబ్బంది ఎదురవుతుంది .


వచ్చినవారు విసిగిపోతున్నారు సరుకులు ఇవ్వడం ఆలస్యం లెక్కలు చూడడం లో ఆలస్యం అని మాటలు అంటూ ఉన్నారు. ఆరోజు తమ్ముడు కి అర్థం అయింది చేసే పని ఏదైనా అందులో నైపుణ్యం ఉన్న వాడే దానిని సరిగ్గా చేయగలుగుతాడు నైపుణ్యం లేనప్పుడు అది ఎంత గొప్ప పని అయినా దాని విలువ పడిపోతుంది అని తెలియని వాడు చేస్తే.


ఈ విషయాన్ని గ్రహించిన వారి గురువు గారు వారి అన్నయ్యని పిలుపు ఈ వాస్తవాన్ని గ్రహించే ఎలా చెప్తారు.అన్నయ్య తమ్ముడు సిగ్గు పడడం చూసి క్షమిం చాడు మరియు ఇలా అన్నాడు ఎదుటివారి మాటలు వినడానికి చాలా బాగుంటాయి కానీ కుటుంబ విషయాలలో వాటిని అమలు చేస్తే చాలా ఇబ్బందులకు గురి అవుతారు అని.తరువాత నుండి వారి వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు ఎదుగుతూ సొంత ఇల్లు కట్టుకుని ఎవరు ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉన్నారు.

© Sadhana.


Rate this content
Log in