బాల్య మిత్రుడు
బాల్య మిత్రుడు


మన ఎదుగుదల తల్లిదండ్రులు ఉంటే ఒకరకంగా లేకుంటే మరో రకంగా ఉంటుంది అనేది సహజ సూత్రం.
సాదారణంగ తల్లిదండ్రులు లేనివారు బతుకు పోరులో లేదా అభివృద్ధి పధంలో వెనకబడటం చూస్తాం. తల్లిదండ్రులు క్రమశిక్షణతో సాకకపోతే చెడిపోయేవారు ఉంటారు. నిన్న మన మిత్రుడు కె.వెంకన్న ను సూర్యాపేటలో అనుకోకుండా కలవడం జరిగింది.
తనకి తల్లిదండ్రులు చిన్ననాటి నుండే లేకపోవడం మీ అందరికి తెలియని విషయం కావొచ్చు. హోటల్లో, షాపుల్లో, పెట్రోలు బంకుల్లో పిడికెడు మెతుకుల కోసం, జానెడు పొట్టనింపుకోవడం కోసం తాను పని చేస్తూ, బతుకు పాఠాలను మన అందరికంటే ముందుగానే అభ్యసించినోడు.
తన విషయంలో క్రమశిక్షణ , పట్టుదల, సహనం, అన్ని అలవర్చుకొని స్వయం కృషికి పర్యాయపదంగా, మన పిల్లలకు బోధించే పాఠంగా ఎదిగినోడు.
ఇపుడు తనకి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి డిగ్రీ పైనాలియర్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, తన సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నాడు. ఈ మధ్యనే అమ్మయికి మానస నగర్ లో తనకున్న 200 గజాల ప్లాటు తో పాటు బంగారం కట్నంగా ఇచ్చేసి ఒక కుర్రాడికి ఇచ్చి
పెండ్లి చేసాడు.
"నా తల్లిదండ్రులు నన్ను నా చిన్ననాడే నన్ను వదిలి కాలంచేశారు " అని విచారవదనంతో చెపుతుంటే బాధ, జాలి కలగకమానదు.
అట్లనే ఓ తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చాడన్న సంతృప్తి, దాని మించి చిన్న గర్వం , అతని పెదవులపైన దరహాసం నా మనసులో ముద్రించుకుంది. ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అడిగితే .....
అన్న ! "నా బతుకు బండిని నడిపిస్తూ నన్ను సమాజంలో తలెత్తి బతికేల చేసిన నా రహాస్యం ఇదేనంటూ'' నవ్వుతూ తన తోపుడు బండి, దాని మీద ఉన్న చిన్న చిన్న ప్లాస్టీక్ వస్తువుల్ని చూపించాడు.
ఎదగటానికి పెద్ద ఇండస్ట్రీనో, తల్లిదండ్రుల ఆస్తూలో, ఎకరాలల్లో వ్యవసాయమో, ప్రభుత్వ ఉద్యోగమో, సాంకేతిక నిపుణులో,గొప్ప ఆర్టిస్టులో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో .....
అవన్ని మన అన్న వెంకన్న తోపుడు బండి కిందలెక్కే.......
అన్నో ! నీవు తోపువే......
ప్రెండ్స్! మనం గర్వించదగ్గ మిత్రుడు. మనం చెప్పుకోదగ్గ మన విజేత వెంకన్న successful Story.
ధన్యవాదాలు
మీ మిత్రుడు
అర్జున్ నర్ర