“
కులాన్ని,మతాన్ని పట్టించుకోదు
పేద,ధనిక తేడా చూడదు
చిన్న,పెద్ద అను వత్యాసం ఉండదు
బంధాలను ముడిపెట్టి పిలువదు
ఆపదలో ఉంటే సహాయానందిస్తుంది
సమస్యలలో ఉన్నపుడు పరిష్కార మార్గం చూపిస్తుంది
ఎవ్వరు లేకున్నా నీకు తోడుగా నడుస్తుంది
జీవన ప్రయాణంలో పడిపోతున్నపుడు చేయ్యందిస్తుంది
జన్మనిచ్చిన కన్నవాళ్ళతో కూడా చెప్పుకోలేనివి
జీవితంలో స్నేహానికి జన్మనిచ్చిన
ఒక స్నేహితునితో మాత్రం అన్ని పంచుకుంటాం స్నేహమంటే ఇదే..
”