STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Others

4.5  

SATYA PAVAN GANDHAM

Others

"యద చప్పుడు"

"యద చప్పుడు"

1 min
91


"ఓ అరుదైన నేస్తమా.."


నల్లని మబ్బులను వెరసి చూస్తున్న నా కళ్ళు..!

వర్షపు చుక్కలతో కలిసి జారుతున్న కన్నీళ్లు..!!

పిల్లగాలి అల్లరికి మూగబోయిన పలుకులు..!

చిటపటల చప్పుడుకి ఆగిపోయిన అడుగులు..!!


ఏకాకినై ప్రతి తలపులో నీకై నా ఆలోచనా..!

ఎడారిలో దొరకని నీటి జాడలా నీ చిరునామా..!!

ఒంటరిగా నీ అన్వేషణలో నా విరామ సమయం..!

సాగరంలో తెప్ప లేని నావలా ఈ నిర్విరామ ప్రయాణం..!!


మనసే మాట విననంటూ ఎదురుతిరుగుతున్నా..!

స్తంభించిన హృదయం నీ రాకకై ఎదురు

చూస్తుంది..!!

ఆశలే ఊహకందనంటూ ఎగిరిపడుతున్నా..!

అలసిన ఊపిరి నీ తోడుకై ఎగిసిపడుతుంది..!!


అడగాలని ఉన్నా ప్రియతమా నీవచట కుశలమా అని..!

అడగలేకున్నా ప్రణయమా నీ యడబాటుతో తడబడుతూ..!!

ఆపలేకున్నా సఖియా నా భావోద్వేగపు భాషని..!

ఆలపించగలనా చెలియా నీ చెంత చేరేవరకూ..!!


యదలోని భావాలను, మదిలోని ఆలోచనలతో ముడివేసి

సృష్టించిన అక్షరాలను, పదాలుగా పేర్చి, వాక్యాలుగా కూర్చి, రచనలా వ్యక్తపరుస్తూ అందించనా ఈ అందమైన కావ్యాన్ని..!

ఆదరించి ఆరాధిస్తారనీ ఆశించనా అపురూప స్వప్నమా..!!



Rate this content
Log in