@7gxj0vf9

Praveena Monangi
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

47
Posts
8
Followers
0
Following

నా పేరు ప్రవీణ.నేను గృహిణిని.రచనలు వ్రాసే అలవాటు చిన్నప్పటి నుండే ఉన్నా...రచయిత్రి సత్యవతి దినావహి గారి ప్రోత్సాహంతో 2016 నుండి కథలు,కవితలు వ్రాయడం ప్రారంభించాను.వచన కవితలు మాత్రమే వ్రాస్తూ ఉంటాను. నా రచనలు చదివిన చాలా మంది పాఠకులు నా కథలు సహజముగా ఉన్నాయని అంటూ ఉంటారు. పాఠకుల అభిమానం,పెద్దల ... Read more

Share with friends
Earned badges
See all

Submitted on 09 Feb, 2021 at 03:09 AM

విజయం ఈ సృష్టిలో మానవుడిగా జన్మించడమే మనము సాధించిన తొలి విజయం.

Submitted on 29 Jan, 2021 at 03:53 AM

ఆదర్శం మన జీవితం నలుగురికి ఆదర్శవంతం కాకపోయినా పరవాలేదు, ఎందరో మహానుభావుల జీవితాలను ఆదర్శవంతంగా తీసుకుని మన గమ్యానికి దారులు సుగమం చేసుకోవచ్చు.

Submitted on 28 Jan, 2021 at 05:55 AM

గెలుపు బాట మది లో ఉండే ఆశలు గది తలుపులు దాటి పరుగులు తీస్తే గెలుపు బాట సుగమమవుతుంది.

Submitted on 20 Jan, 2021 at 05:58 AM

వేడుక తల్లి గర్భంలో అంకురించిన క్షణము నుండి కాటికి పోయేవరకు మనిషి జీవితములో జరిగే ప్రతీ ఘట్టము ఒక వేడుకలా జరుపుకునేది అద్భుతమైన మానవ జన్మలో మాత్రమే!

Submitted on 19 Jan, 2021 at 07:58 AM

కోరిక మనిషి సజీవతకు ఆనవాళ్లు కోరికలు కోరిక కలిగిన ప్రతీ చోటుకి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్లిన ప్రతీ చోటుకి మనిషి వెళ్ళకూడదు ఇంద్రియాలను ఆదీనంలో ఉంచుకుంటూ ఆశించిన కోరికలు సాధ్యమైనంత వరకు తప్పక నెరవేరుతాయి.

Submitted on 18 Jan, 2021 at 03:41 AM

ప్రగతి ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చు అని ఎందరో మహానుభావులు నిరూపించారు. వారి బాటే రేపటి  మన ప్రగతికి బంగారు బాట

Submitted on 13 Jan, 2021 at 18:43 PM

నీలం ఆకాశం నీలం శ్రీకృష్ణుడు దేహం నీలం శ్రీరాముడి వర్ణం నీలం శివుని కంఠం నీలం రత్నాలలో  మేటి  నీలం సముద్రం నీలం భారత క్రికెట్ జెర్సీ నీలం.

Submitted on 12 Jan, 2021 at 13:20 PM

బహుమతి అన్ని జన్మలలో కల్లా ఉత్తమమైన మానవజన్మ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమతి. అపురూపంగా చూసుకుంటూ చక్కని ప్రణాళికలతో,ఆశయాలతో సార్థకత చేసుకోవడమే మనము దేవుడికి తిరిగి ఇచ్చే  బహుమతి🎁.

Submitted on 11 Jan, 2021 at 04:34 AM

ఆకలి ఆకలితో ఉన్న వారికి పిడికెడు అన్నం కూడా పెట్టని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే

Submitted on 10 Jan, 2021 at 17:52 PM

జీవితం జీ - జీవించి ఉన్నంతకాలం వి - విలువలతో కూడిన తం - తంతు

Submitted on 09 Jan, 2021 at 17:19 PM

విజేత గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే గెలిచిన వారిని మనస్ఫూర్తిగా అభినందించడం కూడా ఒక గెలుపే! ఈ రహస్యాన్ని తెలుసుకున్నవారే నిజమైన విజేతలు.

Submitted on 08 Jan, 2021 at 07:06 AM

స్థితప్రజ్ఞత మన రూపం ఎలా ఉన్నా మన అంతస్తులు ఏవైనా కలిమిలేములు ఎలా ఉన్నా మన ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరనివ్వక పోవడమే స్థితప్రజ్ఞత.

Submitted on 08 Jan, 2021 at 06:52 AM

అమ్మ A -అంతులేని M- మమకారాన్ని M-ముద్దులతో మూటకట్టి మురిపెముగా మనకి A-అందించే అపరంజి అమ్మ

Submitted on 06 Jan, 2021 at 17:51 PM

కీర్తి త్రికరణ శుద్ధిగా ఆర్తి గుండెలనిండా స్ఫూర్తి మరి రాకుండా ఎక్కడికి పోతుంది కీర్తి

Submitted on 05 Jan, 2021 at 06:24 AM

నీరు నేడు ఒక్క నీటి బొట్టుని వృదా చేసినా! రేపు రాల్చడానికి ఒక్క కన్నీటి బొట్టు కూడా మిగలదు

Submitted on 04 Jan, 2021 at 05:20 AM

గారాబం మనకి చిన్నతనంలో ముద్దు జరగలేదన్న భ్రమలో మన పిల్లల్ని బాగా చూసుకోవాలనే భ్రాంతిలో వాళ్ళని అతి గారాబం చేస్తున్నాం, అతి ఏదైనా అనర్థమే.

Submitted on 03 Jan, 2021 at 11:41 AM

చిత్రం మనం వినే మాటల కన్నా చూసే చిత్రం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Submitted on 02 Jan, 2021 at 05:48 AM

కాలం కాలం చాలా విలువైంది గడిచిన ఒక్క క్షణం కూడా మరల తిరిగి రాదు, జ్ఞాపకాలు తప్ప. అద్భుతమైన మానవ జన్మలో కాలంతో పాటు అన్నీ అపురూపమైన సంపదలే

Submitted on 30 Dec, 2020 at 09:35 AM

స్వేచ్ఛ పరిమితి దాటనంత వరకు ఆనందాన్ని ఇస్తుంది మితిమీరితే విషాదాన్ని మిగుల్చుతుంది.

Submitted on 28 Sep, 2020 at 12:02 PM

సూటి పోటి మాటలెదురయినా  సూటిగా సుత్తి లేకుండా మాట్లాడు సుతిమెత్తని వాక్కులనే   సూటిగా మాట్లాడుటయే మిన్న


Feed

Library

Write

Notification

Profile