వ్యసనం
వ్యసనం
1
"మందులోడ.. ఓరీ మాయ...లోడ..మందు..మందు",
రోశయ్య.దారంతా చీకటితో మూసుకుపోయింది.అదే
తనపతనానికి దారి అని గుర్తించలేదు రోశయ్య.బిగ్గర
శ్వాస,కీచురాళ్ళ గొంతు, దూరపు - దూరపు అడుగుల
శబ్ధం.ఒళ్ళు తెలియకుండా ఊగిపోతున్నాడు రోశయ్య.
ఆపాదమస్తకం ఒణుకుతుంది ఆ చలికి.సగం చూపు
మత్తు,సగం ఆలోచనలతో ఓ పూరిళ్ళు కనబడుతుంది
ఆ పూరిళ్ళు దగ్గరలో సగం అడ్డుగోడ ఉన్న,కొంచెం వెలితితో ఓ బావి.గంట 11 అవుతుంది.ఊరంతా నిద్రలో ఉంది. శుష్కించిన శరీరంతో మట్టి గోడ మీద నుంచి దూకాడు.చటక్కన పూలమొక్క విరిగిన శబ్ధం.ప్రాణం పోయింది.ఇది మొదటిది.ఆ ఇంటి పువ్వును కూడా నలిపేస్తాడని గ్రహించలేదు రోశయ్య.రెండు పెద్దడుగుల దూరంలో గురక శబ్ధం. వార్ధక్యంలో ఉన్న ఇద్దరు చేస్తున్న పని అది.వాళ్లిద్దరి సంతాపం లోపడ గదిలో పడుకుంది.
ఎదురుగా బల్లమీద దివంగతుల ఫోట ఒకటి.దానికో పూలదండ ఎదురు ఇత్తడి కుందె.
"గుర్...గుర్...గుర్".ఇత్తడి కుందె నుండి నల్లని పొగ సగం మూసిన నల్లని గుడ్డును తాకగానే రోశయ్య కన్ను
ఆ ఇత్తడి కుందె మీద పడ్డది.నోటి నుండి చొంగ,కళ్లల్లో
కార్పణ్యం.ఆ కుందె ఎత్తే తరుణంలో బళ్లకి తగిలి నూనె వొలకగా ...ఫోటో పడిన శబ్ధం. ఆ ఇంటి ఆవిడ
మేలుకోగ,రోశయ్య మోము ముందు ఇత్తడి కుందె వెలుగు...
"అల్లుడు...!!" పెద్దావిడి పెద్దగొంతుతో...
2
"అబ్బాయిది పెద్ద అరటికాయల యాపారం అంట..
ఎంతో పలుకుబడి అంట.."చాలా సంతోషమే పిల్లా నీకు.అమ్మ మాటలు వినడంతో లతమ్మ కళ్లల్లో ఆనందం,ఆశ.లతమ్మ మెళ్ళో ముళ్ళు పడ్డాక,ముళ్ళ
దారిలో వెళ్లాల్సివస్తుందని తెలుసుకోలేదు.తన బాల్యం నుండి పెరుగుతున్న ఊరిని వదిలి బస్తికి
వెళ్ళాల్సిన పరిస్థితి.దంపతులిద్దరూ బస్సు ఎక్కారు.
లతమ్మ రోశయ్య భుజాన తలవాల్చింది.బస్సు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది.గుండె
బరువెక్కి,కాళ్ళ నుండి నీళ్ళు జారాయి.నిశ్శబ్ద ప్రయాణం కొనసాగింది....దూరపు ఆకాశం తెల్లబడింది.బస్తీకి చేరువలో ఉన్నారు..సమయం 6
అవుతుంది.బస్తీకి చివర ఓ గది అద్దెకు తీసుకున్నాడు
రోశయ్య.చుట్టుప్రక్కల 5-6 కాపురాలు ఉంటున్నాయి.
"పెద్ద వ్యాపారం ఉండి,కొంత ఎనకుండి చిన్న గది
తీసుకోవడం ఏంటి",లతమ్మకు ఒకటే ఆలోచన.
రోశయ్య పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆతురతతో అడిగేసింది ఓ అడుగేసి.బండారం బయటపడ్డది."ఈ యాపారం మా ఇద్దరి అన్నలది..,
నేను అదే కొట్టులో పనిచేసుకుంటాను.. అయిన నిన్ను
బాగా చూసుకుంటాలే ..నిబ్బరంగా ఉండు.."అని
సమాధానమిచ్చాడు రోశయ్య. భర్త మాటలు నమ్మి
తలూపింది.
లతమ్మ శోభవంతురాలు. రోజు తన పనిని బేగ ముగించుకుని లతమ్మతో ఉండడానికి వచ్చేవాడు.
భర్త మాటలకి సన్నగా చిన్నగా నవ్వేది సిగ్గుపడుతూ.
లతమ్మ అందరితో కలుపుగోలుగా ఉంటుంది.ఇరుగు
పొరుగు వళ్ళంతా పగలు లతమ్మ దగ్గరే ఉండేవాళ్ళు.
జీవితం ప్రశాంతంగా సాగుతూ ఉంది..
యధావిధిగా రోశయ్య తన పని ముగించుకొని
ఇంటికి బయలుదేరాడు.ఈరోజు రోజు వెళ్ళే దారిలో
కాకుండా అడ్డదారిలో వెళ్ళాడు.రోడ్డు చివర మలుపు
దగ్గర ఓ చిన్న కాంతి.దగ్గరగా వెళ్ళాడు.ఒక్క సారిగా
కళ్లల్లో ఆశ,ఒళ్ళంతా జలతరిస్తుంది.ఆ సారాకొట్టులో
సారా తాగేంతవరకు సంసారానికి ఇంటికి వెళ్ళేటట్టులేడు.ఆ రోజు జీతంతో కుండ సారాకొన్నాడు.
అడ్డదారులు తొక్కడం జీవిత వినాశనం అని గ్రహించలేదు.
కుండలోనిది కాయంలో పడగానే ఏదో తెలియని
ఆనందం.ఒళ్ళంతా తేలికగా ఉన్నట్టుంది.మనసులో
చిన్న ఆశ ఇంకా తాగాలి అని...లతమ్మ ఇంటి దగ్గర
కళ్లల్లో ఒత్తులేసుకుని కూర్చుంది.సమయం ఉదయం
1 అవుతుంది.లతమ్మ ఆలోచనద్రవ్యంలో మునిగిపోయింది.దూరం నుంచి ఊగుతూ ఎవరో
వస్తున్నట్లు గమనించి దగ్గరకు వెళ్లి చూస్తే రోశయ్య.
ఒంటి మీద నాలుగు బొత్తలు విప్పిన చొక్కా మాత్రమే
ఉంది.లతమ్మ ఏడుస్తూ రోశయ్యను లోపలికి తీసుకెళ్లి
ఓ లుంగీ చుట్టి మంచాన పడుకోబెట్టింది.లతమ్మ తల
పట్టుకు కూర్చొని ఏడుస్తుంది.ఒక్కసారిగా గదితో పాటు
తన మది కూడా చీకటైపోయింది.
వెలుతురు కిటికీలో నుండి సరాసరిగా మొహం మీద
పడుతుంది.తన జీవితంలో కూడా వెలుతురు రాదా..!
అని చిన్న ఆశ.మొహం మీద ఆ కన్నీటి చారలు అలానే ఉన్నాయి.చిన్నగా తలపైకెత్తి చూసింది.అప్పుడే రోశయ్య కళ్ళు నలుపుకుంటున్నాడు.పరస్పరం చూసుకున్నారు.
క్షమించరాని తప్పు చేసాడని బాధ.అంత మౌనం....
వెంటనే భార్యను కౌగలించుకొని బిగ్గరగా ఏడ్చాడు.
"క్షమించు లత..క్షమించు.." లతమ్మ ఏడుస్తూ తల నిమిరింది..ఓ రోజు తర్వాత రోశయ్య పనికెల్లాడు.
ఓ రెండు రోజులు మామూలుగానే ఉన్నాడు.కానీ ఆ
ఆలోచనలు పదే పదే తలంటుతున్నాయి.ఓపిక నశించింది,జీవితం నాశనమైంది.రోజు 9 గంటలకు ఇంటి వెళ్ళే రోశయ్య ,12 లేదా 1 అయితే గాని ఇంటి
ముఖం చూడట్లేదు.కాలం గడిచింది.రోశయ్య ఇంటికి
వచ్చి 6 దినాలువుతుంది.లతమ్మకు ఏం చేయాలో తెలియని పరిస్థితి.మది మౌనంతో ఏవేవో ఆలోచనలు.
చెట్టుకి ముల్లతీగ అల్లుకున్నట్టు ,ఆ ఇంటిని దరిద్రం అల్లుకుంది. బోసిపోయి,నిశబ్దంగా ఉన్న ఇంటిలో ఫోన్
మోగుతుంది."అమ్మమ్మగారిది సంవత్సరికం,ఆడబిడ్డ
కచ్చితంగా ఉండాలి,అల్లుడిని తీసుకొని రా లత.." ఇదీ కబురు.వెళ్లకపోతే అనుమానం వస్తుందేమో అన్న
అనుమానంతో ఊరికి ప్రయాణమయ్యింది.
మామూలుగా ఉన్న లతమ్మ ముఖం చూసి నిమ్మకునీరేత్తినట్లు ఉన్నారు ఇద్దరు.
సమయం రాత్రి 10 అవుతుంది. సంవత్సరిక కార్యక్రమం ముగిసింది.సట్టులు కాలి అయ్యాయి. ఆ
కార్యక్రమం తాలూకు వస్తువులు వసారాలో ఉంచి లతమ్మ లోపడ పడుకుంది.భర్త ఆలోచనలతో మెల్లగా
నిద్రలోకి జారుకుంది.కొంత సమయానికి ,"అల్లుడు..."
అని బిగ్గర అరవడంతో చటక్కన నిద్రలేచింది. ఎన్నో
తలపులతో తలుపు తెరిచింది.ఒక వైపు కన్న తల్లితండ్రులు రక్తపు మడుగులో ,మరో వైపు తానే తన
సర్వశ్వం అనుకొంటున్న తన భర్త క్రూరుడిగా...
ఆవేశం అంచుకొచ్చింది .శక్తి మేరకు పోరాడింది.ఆ ఇత్తడి కుందె తలకి గట్టిగా తగలడంతో ఆ కుందెకున్న
వెలుగుతో పాటు తన జీవితం కూడా ఆరిపోయింది.
"చ్.. చ్..ప్..చు", కుందె నుండి రక్తపు బొట్టుల.ఆ
కుందె తీసుకొని కల్లోలో కార్పణ్యంతో, మత్తుతో ఒళ్లునిండిన రోశయ్య ,పెద్ద అడుగులతో బూదరగ కనిపిస్తున్న ఆ ఇంటి గోడను దూకి, తూకానికి వెళ్తున్నాడు ...ఓ నాలుగు పెద్ద అడుగులు వేసిన తర్వాత ఏదో పెద్ద వస్తువు నీళ్ళల్లో పడ్డ శబ్ధం.
"వ్యసనం---- వినాశనం...
వ్యసనం--- వ్యర్థం....
వ్యసనం---- వల్లకాడు..."
