పర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణ
అవి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న రోజులు. ఒకతను వినాయకుడి మండపం లో కూర్చుని రాత్రంతా వినాయకుని ధ్యానించాలని అనుకున్నాడు. అతని పేరు సాకేత్. పూజ నైవేద్యం భజనలు అన్ని ముగిశాక మండపం లో కూర్చుని అందరూ వెళ్ళిపోయాక ధ్యానించడం మొదలుపెట్టాడు. కొంత సమయం అయ్యాక ఏదో అలికిడి అయినట్టు అనిపించింది కన్నులు తెరిచి చూసేసరికి వినాయకుడి విగ్రహం స్థానంలో నిజమైన వినాయకుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన ప్రమేయం లేకుండానే రెండు చేతులెత్తి దండం పెడతాడు. అది చూసిన వినాయకుడు నా కోసం ధ్యానం చేశావు నేను ప్రత్యక్షమైతే రెండు కళ్ళు తెరిచి చూడవా అని అడుగుతాడు. అప్పుడు సాకేత్ వెంటనే తన రెండు కళ్ళు తెరిచి మళ్లీ నువ్వు మాయమైపోతాయి ఏమో అని భయంతో కదలకుండా కూర్చుని చూస్తున్నాను స్వామి అంటాడు సాకేత్. స్వామి రెండు సంవత్సరాల తర్వాత మీ వేడుకలు మళ్లీ ఇలా జరుపుకుంటున్న అందుకు చాలా సంతోషంగా ఉంది అంటాడు సాకేత్. నా పుట్టినరోజు వేడుకలు రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ ఇప్పటికీ మీ ప్రజల్లో పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆలోచన రావడం లేదు అదే కొంత బాధగా ఉంది అంటాడు వినాయకుడు. ఇప్పుడు ఏమైంది స్వామి అంటాడు సాకేత్. కరోనా అంత విజృంభించి తగ్గాక కూడా మీకు సామాజిక దూరం పాటించాలని ఆలోచన లేదు మాస్కులు ధరించడం లేదు పెళ్లిళ్లు వేడుకలు అనుకుంటూ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు మట్టి విగ్రహాలు పెట్టి నన్ను పూజించండి అంటే వినరు కలర్ఫుల్ విగ్రహాలు పెట్టి పూజించండి అని నేనడిగానా. కలర్ ఫుల్ గా మెరిసిపోతూ పెయింటింగ్ ల తో ఉండే నా విగ్రహాలు అందరినీ అట్రాక్ట్ చేస్తాయి కానీ వాటి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలియదా. ఆ విగ్రహాల తయారీలో వాడే కలర్స్ ప్లాస్టర్-ఆఫ్-పారిస్ వంటి వాటి వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి అని మీకు తెలియదా. అలా తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితం అవుతాయి ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతాయి ఆ నీటిని మనం వాడడం వల్ల చర్మంపై అలర్జీలు వస్తాయి ఇన్ని అనర్థాలకు గురికావడం కన్నా మట్టి విగ్రహాలు తెచ్చుకుంటే ఎలాంటి హాని జరగదు కదా. వాటి వల్ల వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పటికే కరోనా వల్ల ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం పెరిగి అంటే సర్జికల్ మాస్కులు ప్లాస్టిక్ బ్లౌజులు టిష్యూ సూదులు సిరంజీలు ఇట్లు ప్లాస్టిక్ వ్యర్ధాలను నదుల్లో నీరు ఎలా కలుషితం అవుతుంది నా విగ్రహాల నైనా మట్టి పెడితే కొంతలో కొంతైనా నీటి కాలుష్యాన్ని తగ్గించిన వారవుతారు కదా. అసలు మట్టి విగ్రహాలను పెట్టడానికి ఒక కారణం ఉంది తెలుసా అని అంటాడు వినాయకుడు అది ఏమిటి స్వామీ అని అడుగుతాడు సాకేత్. పూర్వకాలం చెరువులో ఉండే మట్టి తెచ్చి వినాయకుని విగ్రహాన్ని చేసి ఆరాధించేవారు ఎందుకంటే గా ఉన్నప్పుడు చెరువుకు గండి కొట్టకుండా చెరువులో ఉన్న మట్టి తేవడం వల్ల పెరిగేది వినాయకుని పూజలో ఉపయోగించే పత్రాల లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి చెరువులో వేయడం వల్ల రసాయనిక చర్య జరిగి ఆక్సీకరణం చెంది ఆ నీరంతా శుభ్రమైన సంజీవని లాగా మారుతుంది. వర్షఋతువు శ్రావణ మాసం మొదలు అవుతుంది వర్షాలు పడి చిత్తడి నేల అంతా ఫంగస్ చేరి రకరకాల విష జ్వరాలు వస్తాయి విష జ్వరాలు మనం తీసుకునే నీటి ద్వారానే వస్తాయి కలుషితమైన నీటిని అమృతంలా మార్చడానికి ఈ పత్రాలను వాడుతారు. ఈ పత్రాలలోని ఔషధగుణాలు చెరువులోని నీటి లో చేరి నీరు శుభ్రపడి ఔషధంలా మారి మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇది మహర్షులు అవలంబించిన పద్ధతి అంటాడు వినాయకుడు. అప్పుడు సాకేత్ మట్టి విగ్రహాలను పత్రిని ఉపయోగించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయా అని అంటాడు. నాకు పత్రి అంటే ఎంతో ఇష్టం కానీ నా పేరు చెప్పుకుని నా ఊరేగింపు లేని ఎన్నో చట్టం కొట్టేస్తూ ఉంటారు మీరు. వినాయక వినాయకుడి నవరాత్రులు అని చెప్పి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వినాయకుడి మండపాలు లో కూర్చుని శాస్త్రీయమైన భజనలు చేయండి కానీ స్పీకర్లు పెట్టి నా చెవులు పగిలిపోయేలా శబ్దాలు ఏమిటి అసలే నా చెవులు పెద్దవి అని వినాయకుడు తన బాధని వ్యక్త పరుస్తాడు. స్పీకర్ ల వల్ల చుట్టుపక్కల వాళ్ళ కూడా ఇబ్బంది కలుగుతుంది. వీధుల్లోని రహదారులన్నీ ఆక్రమించి మండపాలు నిర్మించి సామాన్య మానవులకు ఇబ్బంది కలిగించకూడదు . సాంప్రదాయాల్ని పాటించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలి. ప్రకృతిలో ఉండే నేల నీరు చెట్టు పుట్ట లాంటి ప్రకృతి శక్తులన్నింటినీ మనం రక్షించుకోవడం మన సంస్కృతి సంప్రదాయంలో భాగం ఇదే మన భారతీయ సాంప్రదాయం లోని గొప్పతనం కాబట్టి మన పండుగలలో ప్రకృతికి ఇబ్బంది సృష్టించే పద్ధతులను పక్కన ఉంచి పర్యావరణ హితంగా పండుగల జరుపుకుందాం పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన అందమైన సమాజాన్ని అందిద్దాం. లా అలంకారాల కి చివరిరోజు డబ్బులకి ఖర్చుపెట్టే దానికన్నా ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తే నాకు సంతోషం కలుగుతుంది. నేను పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టమని అడిగాను చిన్న విగ్రహాలు పెట్టి పూజిస్తే నేను అనుగ్రహిం చనా. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం నిమజ్జనం తీసుకెళ్తున్న అడ్డుగా ఉన్నాయని చెట్లు కొట్టే యమని నేను చెప్పానా మీరందరూ నా పేరు చెప్పుకొని పర్యావరణానికి హాని కలిగించే పనులన్నీ చేస్తున్నారు. నా విగ్రహాలు పెట్టుకుని మండపాల్లో కూర్చుని పూజలు భజనలు చేయకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ కూర్చుంటారు అవన్నీ వింటూ నా చెవులు పగిలి పోతున్నాయి. పూజ అని వచ్చి పూజ చేయకుండా అలంకారాల మీద దృష్టిని అందరికీ భక్తి భావం ఏమాత్రమూ లేదు. నాకు అవన్నీ చేసే కన్నా పసుపు వినాయకుని చేసి పూజించిన నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా గా నా పూజలు చేయకండి ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరూ ఈ పద్ధతిని అవలంబించి చూడు సాకేత్ అంటాడు వినాయకుడు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది అంటాడు వినాయకుడు. నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాల మీద అవగాహన కలిగేలా గా చెప్పి ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను అని నీకు మాట ఇస్తున్నాను స్వామి మీరు ఏం బాధపడకండి అంటాడు సాకేత్. ఇవన్నీ నీకు తెలియ చెప్పడానికి నేను నీకు ప్రత్యక్షమయ్యాను నేను చెప్పినవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని ఆశిస్తున్నాను అంటాడు వినాయకుడు. పర్యావరణానికి హాని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మన పండుగలను జరుపుకుందాం
