పగబట్టిన త్రాచుపాము
పగబట్టిన త్రాచుపాము
మొదటి పేజీ
ఫ్రెండ్స్ ఇది నా చిన్నప్పుడు నా జీవితంలో నిజంగా జరిగిన యదార్థ సంఘటన.
అది 1977 వ సంవత్సరం. నాకు అప్పుడు ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది. మా అమ్మగారు తుమృకోట అనే గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు టీచర్ గా జాబ్ చేసేవారు. తుమృకోట మా ఊరికి 24 కి మీ దూరంలో ఉంటుంది కనుక నేను, మా అమ్మగారు నాకు వరుసకి అమ్మమ్మ అయ్యే వాళ్ళింట్లో ఉండేవారం. అప్పుడు నేను మా అమ్మగారు ఉద్యోగం చేసే స్కూల్ లోనే రెండవ తరగతి చదువుతుండేవాడిని. మా ఇల్లు వీధిలో రెండవ ఇల్లు. ఫస్ట్ ఒక మట్టిమిద్దె ఉంటుంది దానిలో ఒక చిన్న పాఠశాల నడిపించేవారు. దాన్ని ఆనుకుని మేముండే మా అమ్మమ్మ గారి ఇల్లు ఉంటుంది. మా ఇంటి వెనుక వీధికి అవతలివైపు రెండు పెద్ద ఖాళీ స్థలాలు ఉండేవి. వాటిలో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ ఖాళీ స్థలం అవతలి అంచుకు చిన్న ప్రహరీగోడ దాన్ని ఆనుకుని ఒక చిన్న పంటకాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ అవతలివైపు వర్షాకాలంలో మాత్రమే వరి పండించే పొలాలు ఉండేవి. ఎండాకాలంలో అవి పెద్ద గ్రౌండ్ లా మా పిల్లలంతా సాయంకాలం ఆడుకునేవాళ్ళం. మేముండే వీధిలో మొదట మా ఇల్లు తర్వాత వరుసగా మా స్నేహితుల ఇళ్ళు ఉంటాయి. మేముండే ఇంటి బేస్మెంట్ కొంచెం ఎత్తుగా ఉంటుంది.
