నీతో నేను లేనా...?
నీతో నేను లేనా...?
1 min
22K
ఉదయ భానుడి కిరణాలతో నా ఎద గూటికి చేరిన నిన్ను దేవతలా చూస్తున్నా..!
చిరుగాలిలో దీపంలా కాస్తున్నా...!
నా ప్రాణం నువ్ తిస్తున్నా...!
నీ ధ్యానం నే చేస్తున్నా.. !
నా మనస్సు అడగదు..
నీ వలపుల తలపులతో తూలినా,
నీ చూపుల చురుకుదనంతో నలిగినా హృదయం...
నీ బాసలా ఊసులు ఎదలో మారినా...
నా గుండె దాచుకోలేని ఈ తీపి గొడవలు...
చక్కనైన దానా దక్కని దానా రెక్కలు కట్టుకుని రానా ఊపిరి అగుతున్నా....
అంది అందని దానా అందమైన దానా అంకితం నీకే అన్నా... నన్ను కాదన్నా....
సుడిగాలికి ఎగిరిన ఎండుటాకులా ఎగిరిపోతున్నా...
ఈ సమిధపై పూసే సన్నజాజి పరిమళాలు-
నంది కొండలలోని గమనాలు, గుర్తుకొస్తున్నాయా..
ఇప్పుడైనా....
నీ ఎద లో నేను లేనా...?
శ్రద్ద ఉన్నవాడు సమస్తం ఉన్నవాడు.
శ్రద్ద లేని వాడు ఏమి లేనివాడు.
శ్రీ రామకృష్ణ పరమహంస సూక్తి