STORYMIRROR

SUNKARA PaNIT

Others

3  

SUNKARA PaNIT

Others

నా చిన్న ప్రేమకథ

నా చిన్న ప్రేమకథ

2 mins
8

"ప్రేమ... అది చిన్న వయసులోని మధుర జ్ఞాపకం కావచ్చు, కానీ దాని వెనుక ఉండే భావాలు మాత్రం గాఢంగా ఉంటాయి. నాలోని మొదటి ప్రేమను గుర్తు చేసుకుంటే, ఆ చిన్న అనుభవాలు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.


నా ప్రేమకథ


ప్రేమ... అది చిన్న వయసులోని మధుర జ్ఞాపకం కావచ్చు, కానీ దాని వెనుక ఉండే భావాలు మాత్రం గాఢంగా ఉంటాయి. నాలోని మొదటి ప్రేమను గుర్తు చేసుకుంటే, ఆ చిన్న అనుభవాలు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.


నేను చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. మొదటి తరగతి లోనే ఉన్నప్పుడు, మా కుటుంబ పరిస్థితుల వల్ల నాకు ప్రైవేట్ పాఠశాలకు మారాల్సి వచ్చింది. ఆ ప్రైవేట్ పాఠశాలలోనే నేను మొదటి తరగతి కొనసాగించాను. అప్పుడు నేను ఇద్దరు అమ్మాయిలను కలిసాను, వాళ్ళు జంటలు. వారి పేర్లు చెప్పడానికి ఇష్ట పడట్లేదు, కానీ నేను వారిని చాలా ఇష్ట పడ్డాను.


నేను వాళ్లను ప్రేమిస్తున్నా నా లేక స్నేహంగా భావిస్తున్నా నా అని నాకు తెలియదు, కానీ వారి సమ కాలీనత నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. పాఠశాల సమయాల్లో మేము ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటాము. ఆ ఆటల సమయాలు నా జీవితంలో ఆనందమయము గా ఉండేవి.


అయితే, ఆ తరువాత మేము వేరే పాఠశాలలో చేరడంతో, మా మధ్య సంబంధం లేకుండా పోయింది. మా ఊరిలోనే ఉన్నప్పటికీ, మేము ఒకరినొకరు కలిసిన సందర్భాలు లేకుండా పోయాయి. కానీ ఒక రోజు, నేను ఒక పని కోసం వాళ్ళ ఇంటికి వెళ్లాను. నేను వాళ్ళను కలవడానికి కాదు, కానీ ఆ పని సమయంలో వాళ్ళ తల్లి నాకు ఆ అమ్మాయిలు ఎవరు అనే విషయాన్ని అడిగారు.


వాళ్ల తల్లి నా పేరు మరియు నా తల్లి పేరు చెప్పగా, ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందా, అవును, కొంచెం నెర్వస్‌అయ్యాను. కానీ వారు చాలా మంచి వాళ్లు. వాళ్ళు అనుకున్నది ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు వాళ్ళతో మాట్లాడటానికి సిగ్గు వొచ్చింది.


ఆ సందర్భం తర్వాత మేము మళ్లీ మాట్లాడలేదు. వారి జ్ఞాపకాలు మాత్రం నాకు ఎప్పుడూ ఉంటాయి. నా చిన్న వయసులోనే అనుభవించిన ఆ చిన్న ప్రేమ అనుభవం ఒక మంచి జ్ఞాపకంగా నాకు ఉంది.


ప్రేమ అనేది వయసుతో సంబంధం లేకుండా మనసులోని భావాలు మాత్రమే. నేను చిన్నప్పుడే అనుభవించిన ఆ చిన్న భావం నాకు మధుర జ్ఞాపకం. అవును, చిన్న వయసులో కూడా ప్రేమ అనుభవాలు ఉండవచ్చు. కానీ దానిని ప్రేమ అని అప్పుడు అర్థం చేసుకోవడం కష్టమేమో.


ఇప్పుడు కూడా నేను ఆ జంటలను గుర్తు చేసుకుంటే, నా హృదయంలో ఒక చిన్న ప్రేమ అనుభవం ఉందని అనిపిస్తుంది. నేను వాళ్ళను మళ్లీ కలిసే అవకాశం లేకపోయినా, ఆ జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఇది నా చిన్న వయసులో జరిగిన మధుర ప్రేమకథ, ఎవరికీ ఊహించని విధంగా ఉన్న కథ.





Rate this content
Log in