బ్యూటిఫుల్ గ్రేస్ ఇన్ ది ఫారెస్ట్
బ్యూటిఫుల్ గ్రేస్ ఇన్ ది ఫారెస్ట్
సృష్టిలో ఎన్నో అంధాలు ఉన్నాయ్ అందులో ఒక అందం కథే ఇది
తన పేరు గ్రేస్ నేను చూసిన అమ్మాయాల్లో తన అంత అందమైన అమ్మాయిని ఇప్పటివరకు చూడలేదు
తనని ఇష్టపడని వారు ఎవరు ఉండరు చివరికి
దట్టమైన అడవిలో క్రూర మృగాలు కూడా
తనగురించి చెప్పడానికి నన్ను ఆకరిషించినది కూడా అదే
ఆ అందమైన అమ్మాయిని నేను అడవిలో చూసాను ఒకటే నిర్భయంగా ఎంతో సంతోషంతో అడవి అంత తిరుగుతుంది తను క్రూరమృగాలు ఉండే వైపు వెళ్తుంది పులులు తిరిగే వైపు వెళ్ళింది తనకి ఎమన్నా అవుతుందేమోనని చాలా భయం వేసింది నేను కూడా ధైర్యం చేసి తను నడిచిన అడుగులవైపే ముందుకుసాగాను
తనని దూరంనుంచి చూసాను తనకన్నుల్లో ప్రశాంతత కనబడింది నేను తనని పిలిచేలోపే ఒక పులిని చూసాను దాక్కున్నాను అది ఆ అమ్మాయివైపు వస్తుంటే మాత్రం తన కళ్ళలో సంతోషం కనబడింది తన చేతులు చాచి ఆ పులిని తన కౌగిట్లోకి ఆహ్వానించింది ఆ పులి తనమీద దాడి చెయ్యకుండా వచ్చి తన కౌగిట వాలింది మిగిలిన పులులు అన్ని వచ్చి తన చుట్టూ కూర్చున్నాయి పులిపిల్లలతో తను ఆడుకుంటుంటే పెద్దపులులు తనకి కాపలా కాస్తుంటే దానిని ఏమని వర్ణించాలో నాకు అర్ధంకాలేదు
అడివికి ఒక రాణి ఉంటే అడవిమృగాల్లన్నీ తనకి కాపలాకాస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది
తను అమాయకపు కన్నె పిల్లా లేక దైవంలాంటి అడవితల్లా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంతలో
తను అక్కడనుండి అడవి మొత్తం తిరుగుతుంది నేను రహస్యంగా తనని చూస్తున్నాను తను నడుచుకుంటూ వెళ్తుంటే ఏనుగులు తనని ఏమిచేయ్యలేదు తను సరదాగా వాటితో ఆడుకుంటుంది తను మాయా లేక దైవమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను
తను నాకు దైవంలా కనిపించింది ఏనుగులు తాగే చెరువు ఇంకిపోయింది తను చెయ్యిపెట్టగానే అది నీళ్లతోనిండింది అప్పుడే నాకు అర్ధమయ్యింది తను దైవమే అని
వెంటనే నేను తన దగ్గరకు వెళ్లి తనతో మాట్లాడాను తను చాలా మంచిగా మాట్లాడింది నేను తనపేరు ఏంటి అని అడిగాను
తను నా పేరు గ్రేస్ అని చెప్పింది
అప్పుడే నాకు అర్ధమయ్యింది నేను ఉన్నది గ్రేస్ ఫారెస్ట్ లో అని ఆ అడవి దైవమే తను అని
తనని గౌరవించి నమస్కరించి అక్కడనుండి సెలవు తీసుకున్నాను
