ఉదయం
ఉదయం
1 min
342
తొలి కోడి కూయంగా
పక్షుల కిలకిల రాగాలు పలుకుతుండంగా
సేద తీరిన తనువు
ఉలిక్కి పడి లేవంగ
ఉన్న పని గుర్తుకు వచ్చి
నిద్ర మొత్తం తెగిపోగా
నూతన ఉత్సాహంతో మేల్కొంది
సూరీడు రాకమునుపే సేలలోకి చేరిపోవాలని
అందర్నీ మేల్కొల్పి
ఇల్లు శుభ్రం చేసి
కళ్ళాపి జల్లి
ముగ్గులు వేసి
పాలు పితికి
నీళ్ళు తెచ్చి
పొయ్యి వెలిగించి
వంట జేసే మగువలు
గుడిలోన సుప్రబాత సేవల పాటలు
ఇంటిలోన తులసి మొక్క ప్రదక్షిణలు
స్వచ్ఛమైన గాలి సవ్వడితో
కదులుతున్నారు కాయా కష్టం చేసేందుకు కష్టజీవులు....!!!!
