తెలుగు తీపి
తెలుగు తీపి


తొమ్మిదినెలలు మోసి
లోపలి లావాను ఓర్పుగా పెంచి
యముని ఎదిరించి నిలిచి
చిన్నారి తల్లిని ఒడిలో తొమ్మిదినెలలు పెంచితే ....
రెక్కలు విచ్చిన పువ్వులా విడివడిన ఆ ఎర్రటి పెదాలు పలికే మొదటి మాట...అమ్మ అని!
అమ్మ అని పిలవగానే మురిసి హత్తుకోని తల్లి ఉందా?
నాన్న అనగానే పొగిపోని తండ్రి ఎద ఉందా?
మందార మకరందాలు అద్దుకున్న తీపి కదా తెలుగు
అచ్చులు, హల్లుల తరంగాల ఊయల కదా తెలుగు
బయటి భాషలు అన్నీ ఉదరకృత వేషాలే
మనసు దిగులు తీర్చి ప్రేమను పంచేది తెలుగు
మాఘ పూర్ణిమ వెన్నెల కదా తెలుగు
మార్గశిరపు మంచు చల్లదనం తెలుగు
మామిడి పండు తీపి తెలుగు
మజ్జిగ లోని కమ్మదనం తెలుగు
పులిహోర పాయసాల రుచి తెలుగు
గోంగూర,ఆవకాయ ఘాటు తెలుగు
ఒక్కజన్మ చాలునా అమ్మను పొగడుటకు
ఒక్క నాలుక చాలునా తెలుగు తీపి రుచి చూచుటకు!