STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

సహనము

సహనము

1 min
322


-------------------------

ఒద్దికగా చరించి యోర్పు తోడ

మనుజులు మెల్గగ తొల్గు పీడ

అందరుకలిసి మెలిసి యుండ

సుఖసంపదలు పొరలు చుండ

శాంతి కలుగు జగతిలో విజయా!


సహనగుణమును బట్టి చరించ

పెద్దవారినెప్పుడు గౌరవించ

కష్టములు వచ్చిన భరించ 

హరిని నియమనిష్ఠల పూజించ

శాంతికలుగు జగతిలో విజయా!


పొరుగు వారిని యాదరించ

పరుల కెప్పుడు మేలొనరించ

ప్రేమతో నందరినీ పలుకరించ

ధర్మమార్గము నెప్పుడనుసరించ

శాంతి కలుగు జగతిలో విజయా!

--------------------------


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics