STORYMIRROR

Kunche Sri

Others

5  

Kunche Sri

Others

ప్రేమ

ప్రేమ

1 min
82

ప్రేమ

ఇరువురి హృదయాలు ఒకటై

జంటగా అడుగలేసిన మనసులు

అనుకోని అలికిడి అదిరిన ప్రేమ

సమాజ జనుల మాటల తూటాలకు

రక్తమోడుతున్న ప్రేమమనసులు

ఆరాటపడుతున్నా ఆలింగనం కోసం

ఆవిరవుతున్నా ఆనందాల్ని కోల్పోతూ

నా గుండెచప్పుడు గునపాల మోతలై

నా మనసుకు గుండుసూధులై గుచ్చుతుంటే

అందనంత దూరంలో ప్రేమ

ప్రేమ బందీఖానాలో నేను

చేయి చాచి అందుకోలేకున్నా

నిన్ను పొందలేకున్నా ప్రేమా...

ఏక వర్ణ ప్రేమ ఏకాంతం కోల్పోయి

ఏడడుగులకు ఏడేడు జన్మలు

నీ ప్రేమను పొందడానికి ఎదురుచూస్తా

ఈ చెరసాల మాటున ప్రేమఖైదీనై!!


- కుంచె శ్రీ



Rate this content
Log in

More telugu poem from Kunche Sri