పాల నురగల నేస్తం
పాల నురగల నేస్తం
1 min
3
పాల నురగల
పసి పాపాయి తను
కేరింతలతో మనసుని
నవ్వించి
అలల కౌగిలిలో బంధిస్తుంది
నా ఎద లోతుల్లో దాగిన
బరువంతా
తన మది లోతుల్లో దాస్తుంది.
నా మౌనాన్ని చదివి
తన గానాన్ని నా గుండెలో పోస్తుంది
కనులు మూసి తన చెంత నేనుంటే
గాలి కౌగిలితో మనసారా నను చుట్టేస్తుంది
తనాతో నేనూంటే
జ్ఞాపకాల వల వేసి
నా బాల్యంలో కి తోసేస్తుంది.
తన నవ్వులతో నను జత కలపమంటుంది.
కాలి కింద జారే ఇసుక లాగా
నా గాయాలని లాగేస్తుంది
మళ్ళీ నాలో కొత్త నన్ను పుట్టిస్తుంది.
నేను కనని బిడ్డ తను
నన్ను మోయని ఆమ్మ తను
నా పాల నురగల నేస్తం ఆ సంద్రం
