"నువ్విక తిరిగొస్తావనుకున్నాం"...
"నువ్విక తిరిగొస్తావనుకున్నాం"...


నువ్విక తిరిగొస్తావనుకున్నాం...
నువ్విక తిరిగొస్తావనుకున్నాం రేపోమాపో యుద్ధమేఘాలు ఆవిరైమంచుకొండల్లో మృత్యువు అంచులుమాసిపోయిభారతావని నిర్భయంగా నిద్రించే సమయానికినువ్విక ఇంటికి తిరిగొస్తావనుకున్నాం
నీ కన్నా ముందు నడిచిన ఆశయాలనునిలువెత్తు శిఖరం చేసి నీ ఆకలిని,నిద్రనుసరిహద్దులకే వదిలేసిమంచులోంచి ఎగిరిన పిట్టలావిజయ చరితలు పాడుకుంటూనువ్విక ఇంటికి తిరిగొస్తావనుకున్నాం
తుపాకీ భుజంమ్మీద నుంచి సూర్యోదయాలు దర్శించిశత్రుగుండెల నెత్తుటిలో అస్తమయాలను వీక్షించినీ సోదరుల త్యాగాలనువీర తిలకంగా దిద్దుకొనినువ్విక ఇంటికి తిరిగొస్తావనుకున్నాం
ఓ వీరకిశోరమాపుట్టుక నీది బ్రతుకు మాదినీ త్యాగం వృధాపోదుదెబ్బకు దెబ్బ తీస్తాంచైనా మెడలు విరుస్తాం శత్రు రుధిరంలో తానమాడిసింహ స్వప్నాలై నిలుస్తాం
(గల్వాన్ లోయలో చైనా దొంగదాడిలో వీర స్వర్గం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు భాష్పాంజలి ఘటిస్తూ....)