నీ స్నేహం
నీ స్నేహం
1 min
179
పండు వెన్నెలలో జాబిలి అందం నీ స్నేహం
కుసుమాల లోని సుగంధం నీ స్నేహం
సెలయేటి గలగల చిరుసవ్వడి నీ స్నేహం
పచ్చనిపైరు లోని స్వచ్ఛమైన గాలి నీ స్నేహo
తేనెలోని తీయదనం నీ స్నేహం
అమ్మలోనీ ఆత్మీయ అనురాగం నీ స్నేహం. అలసిన నా మనసుకు ఊరట నీ స్నేహం
కన్నవారు ఇవ్వలేని ఆస్తి నీ స్నేహం
అరమరికలు అణువంతైన లేనిది నీ స్నేహం
నా కన్నులు మూతపడే చివరి క్షణం వరకు నే కోరేది నీ స్నేహం.
