మధ్య తరగతి జీవితం
మధ్య తరగతి జీవితం
ప్రయాణించే దారిలో ఎన్నో గతుకులు..
రోజంతా కష్టపడి తినేది గుప్పెడు మెతుకులు..
మనసు పెట్టి చూస్తే వేసుకున్న బట్టలన్నీ అతుకులు..
ప్రతినిత్యం ఏదో ఒక దానికి వేతుకులు..
రోజు రాత్రి ఎన్నో ఆలోచనలతో కష్టపడి తీస్తారు కునుకులు..
జీవితం మొత్తం జీతం మీద ఆధారపడే బ్రతుకులు..
పోదున్నే ఆశతో చూస్తారు రాశి ఫలాలూ..
అన్ని రాశి నక్షత్రాలకు ఒకటే లాగ ఉంటాయి జాతకాలు..
ఎప్పుడు వెంటాడుతాయి ఏదో ఒక దోషాలు..
మేము ఎన్ని చేసిన పుణ్యాలు..
మాకు మాత్రం మిగిలేవి పితృదేవతల శాపాలు..
నిత్యం దోబూచులాడుతాయి ఆ గ్రహాలు..
అవి అనుకూలంగా లేకపోతే ఆగ్రహాలు..
కస్టపడి కూడపెడితే రూపాయి..
అనుకోకుండా అవి ఖర్చు అయిపోతాయి..
ప్రతి ఇంట్లో ఉంటాడు ఒక సిపాయి..
రోజు వెలగాలి అంటే ఇంట్లో పొయ్యి..
అతనే ముందుంటాడు ఆజ్యం అయ్యి..
ఎదో సాదించాలి అని ఎప్పుడు ఒక ఆరాటం..
దానికోసం చేస్తారు అలుపెరగని పోరాటం..
మనకి ఏమి లేకపోయినా ఉంటుంది మొహమాటం..
మన జీవితం తెగిన గాలిపటం..
