Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ampaiah Ananthapuramu

Others

4  

Ampaiah Ananthapuramu

Others

కరోనా తీరులు- కదలని బడులు

కరోనా తీరులు- కదలని బడులు

1 min
283


పుస్తక ప్రపంచాన్నే చుట్టుముట్టి

నొక చిన్నిచేతిలోకి మార్చినట్టు

ఆగమ్యమై మారినది ఆన్లైన్ బోధన

చదువులతోటి అనుక్షణం

ముఖాముఖి చదువులన్నీ 

మూగబోయే నేడు

సంస్కారమైన నమస్కారకార్యాలు

సాగలేవుగా ఈయేడు

గణగణమనే బడిగంటల్లేక

రింగురింగుమనే సెల్లుఫోనులో

ఆగినాది నేడు ఆన్లైన్ చదువు

పిల్లలకయ్యేనా అది మొక్కలకై ఎరువు

అమ్మ ఆవులంటూ నేర్వాల్సిన జ్ఞానం

హలోహలో లోన యిమిడినాది

మంచి మానవత్వాలన్ని 

మరొక తరుణమై నిలిచినాయి

కరోనా వ్యాధియై కనికరించక

కరువురక్కసై కాదనకుండా సేసి

నోటికేగని చేతికూడులా

మార్చినాది బతుకు కరుణ లేక

ఆగమ్యగోచరమై నిలిచే జీవము

అంతుచిక్కని ఆపదలా

అందరిపై ప్రభావం చూపినాది

రంగాలన్నవి లెక్కసేయకిలా

తత్ఫలితమై ఆగెను సరస్వతి సంద్రాలు

సృష్టించెగా అల్లకల్లోలాలు

నిర్మూలనకై సేయగోరె కార్యక్రమాలు

ఉద్భవించెగ ఆన్లైన్ చదువులు


Rate this content
Log in