ఈ తోవలో చల్లదనం
ఈ తోవలో చల్లదనం
1 min
1
సంసారపు ఎడారి దారిలో...
కోరికల ఎండలు మండిన వేళ...
దిక్కుతోచని నా ఒంటరి పయనానికి
తోడు దొరికిన అభయం..
పాపాల బరువుతో అలసిన పాదాలు
ఆగిపోవాలని అనుకున్న క్షణం...
గుడి గంటల సవ్వడిలా,
అగరుబత్తుల సుగంధంలా...
నన్ను తాకిన నీ కరుణ..
ఏ జన్మ పుణ్యమో పందిరి వేసింది,
ఏ అదృశ్య శక్తియో గొడుగు పట్టింది...
నాదు అనేవారు లేని ఈ అరణ్యంలో
"నేనున్నాను" అనిపించే నీ నామస్మరణ..
అది కేవలం గాలి కాదు దేవా...
నా నుదుటి రాతను మార్చే
నీ పాదధూళి స్పర్శ...
నా ఆత్మకు లభించిన
శాశ్వతమైన చల్లదనం..
25/11/25
-kadem kiran
