cs naidu2022

Abstract Drama Others

4  

cs naidu2022

Abstract Drama Others

ఇదో రకం – Breakup

ఇదో రకం – Breakup

3 mins
292


- - అన్నీ Break Up లు ఒకేలా వుండవు - -

స్వప్న, రాజేష్ ఎంతో కాలంగా ప్రేమించు కొన్నారు, కానీ స్వప్న కి మరో అబ్బాయితో పెళ్ళి నిర్ణయించారు వారి పెద్దలు, చివరి సారి కలుసుకోవడానికి ఒక Park ని ఎంచుకుంటారు.. 

సాయంత్రం స్వప్నపార్క్ లో చెట్టు కింద నెలబడి ఆలోచిస్తూ వుంది, అటు ఇటు తిరుగుతూ ఎదురుచూస్తూ "వీడు ఎప్పుడు లేటే .. చా ." అని చిరాకుగా లో ఆలోచిస్తూ ఉంది.

తన బైక్ పార్క్ చేసి స్వప్న దగ్గరకు రాజేష్ నడుచుకుంటూ వస్తాడు, అమ్మాయి ని కోపంగా చూస్తూ.

"నేను విన్నది నిజమేనా .."అంటాడు

కోపం తో ఇద్దరు ఒకరి కల్ల లోకి ఒకరు చూసుకుంటారు, స్వప్న, రాజేష్ ని గట్టిగా కౌగిలించుకుని.

"మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో వున్న మా బంధువుల అబ్బాయి తో పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నారు, ఇప్పుడు నాన్నేమి చేయమంటావ్ చెప్పు " అని అంటుంది.

స్వప్నని దూరంగా నెట్టి "వాళ్ళు నిర్ణయం తీసుకుంటే, నువ్వు ఒప్పేసుకుంటావా ? అసలు మన ప్రేమ గురిచి, నా గురించి చెప్పాలనిపించలేదా ? " అని పెద్దగా అరుస్తూ కోపం తో ఉగిపోతాడు.

అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటూ "మా Prasant's కంటే నన్ను నువ్వే బాగా చూసుకోగలవు, కష్టం తెలియకుండా, కన్నీళ్ళు రానివ్వకుండా, ప్రతి క్షణం నన్ను ఆనంద పెట్టగలవు, కానీ అని ఆపుతుంది, రాజేష్ , స్వప్న కన్నీళ్ళు తుడుస్తూ "కానీ అంటే ? ఏంటి చెప్పు, ఎడవకు Please నువ్వు ఏడుస్తుంటే.. నేను చూడలేను."

స్వప్న కన్నీళ్ళు తుడుకుకుంటూ రాజేష్ వెనుకకు వెళ్ళి నెలబడి ఆకాశం వైపు చూస్తూ

"నీకు , నాకు, నిజమైన ప్రేమ చాలు, కానీ మా Parent's కి ప్రేమ ఒక్కటే సరిపోదుగా, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు వున్న వాడికి నన్ను ఇవ్వాలనే కోరిక వారికి ఉంటుంది గా .. అని ఏడుస్తుంది 

రాజేష్ చిలిపిగా నవ్వుతూ స్వప్న వైపు తిరిగి చప్పట్లు కొడుతూ.

" హ .. చివరికి నువ్వు కూడా అందరి అమ్మాయిల్లాగే మాట్లాడుతున్నావు .. Hats off…

 ఇన్నిరోజులు నాతో తిరిగినప్పుడు,

నన్ను ప్రేమించేటప్పుడు,

అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా ?

 ప్రేమించడానికి పనికి వచ్చిన నేను..  

పెళ్ళి చేసుకోవడానికి మాత్రం పనికి రాలేదు కదా..? అని కోపంతో రగిలిపోతుంటాడు.

.

వెనక్కి తిరిగి స్వప్న, రాజేష్ని మళ్ళీ గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ..

"నువ్వు ఇలా అర్దం చేసుకుంటావనుకోలేదు., అయితే పద, ఇప్పుడే మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పోదాం.. పదా.."

అమ్మాయిని మల్లీ గట్టిగా నెట్టి కోపం తో రాజేష్ అరుస్తూ

"No.. ఇప్పుడే నాకు అర్దం అయింది,

"నువ్వు చెప్పిన ప్రతి మాట నా గుండెల్ని పిండేసింది , 

"ఇప్పుడు, నేను ఏమీ చేయలేను,

"ఇప్పటికీ ఇప్పుడు గొప్ప ఉద్యోగం సంపాదించలేను, మీ Parent's ని ఒప్పించలేను,

"లేచిపోయి నిన్ను కష్టపెట్టలేను . But I am a true lover,

 "నేను చేయగలిగింది ఒక్కటే ఒక్కటి వుంది.. అందమేంటో తెలుసా, 

.

నా ప్రేమని త్యాగం చేయడం.. హా .. ఆ ఒక్కటే చేయగలను .. హ. అని మోకాళ్లమీద కూర్చుని కుమిలి కుమిలి ఎడుస్తాడు ..

.

రాజేష్ ముందు స్వప్న కూడా మోకాళ్ళపై కూర్చుని కళ్ళలో కన్నీళ్ళు నింపుకుని

"నువ్వు నాకు I Love You అని చెప్పి, పెద్ద తప్పు చేశావు, నువ్వు నాకు ఎన్నో ఇచ్చావ్, మదూరమైన జ్ఞాపకాలనిచ్చావు, కానీ నేను నీకు ఏమి ఇవ్వలేక పోయాను, బాదను తప్ప,

నేను నీకు దేవుడి ఇచ్చిన వరం అన్నావు, కానీ నేను శాపంగా మారాను" అని ఏడుస్తూ

.

ఈ జన్మలో నా మొఖం నీకు చూపించను.. By అని లేస్తూ వుంటుంది, స్వప్న చేతులు పట్టుకుని రాజేష్ ఏడుస్తూ, కళ్లలోకి చూస్తూ..

"ఆ ఒక్క మాట అనకు, ప్రేమించిన వాళ్ళందరూ పెళ్ళి చేసుకోవాలనే లేదు.

ప్రేమకి Break up వుంటుందేమో గాని.. పెళ్ళికి విడాకులు వుంటాయేమో, 

మనకి విడిపోయే హక్కు లేదు .. మనల్ని విడగొట్టే శక్తి లేదు."

స్వప్న రాజేష్ కన్నీళ్ళు తుడుస్తూ

"విడిపోవడం, మరచిపోవడం ఇవి రెండు మనం చనిపోయినప్పుడే జరుగుతాయి,

మనది ఈ ప్రపంచం గుర్తించలేని ప్రేమ బందం."

"ఈ break up మన ప్రేమకి మాత్రమే"

 "ని మనసు, నా మనసు ఒక్కటే, వాటిని ఎవరు విడదీయలేరు." అని ఇద్దరు గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ వుంటారు.

.

రాజేష్ , స్వప్న

అలా ఏడుస్తు, ఏడుస్తు స్వప్న మొహం లో మార్పు వస్తుంది, అప్పటి వరకు ఏడుస్తున్న అమ్మాయి, చిలిపిగా నవ్వుతూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తన మనసులో ఇలా మాట్లాడుకుంటూ ..

.

దేవుడా .. బ్రతికించవు రా .... ఎక్కడ కొడుతాడో అని బయపడి చచ్చాను, ఎలాగోలా ఒప్పుకున్నాడు,

హ.. హాయిగా పెళ్ళి చేసుకుని America చెక్కేస్తా,

India కి వచ్చినప్పుడు విడ్ని వాడుకుంటా.. అని నవ్వుతూ నవ్వుతూ మళ్ళీ బాధపడుతూ వుంటుంది..

.

రాజేష్ ఏడుస్తూ, ఏడుస్తూ చిలిపిగా నవ్వుతూ నెమ్మదిగా కళ్ళు తెరచి నవ్వుతుంటాడు, అతని మనసులో మాట్లాడుకుంటూ .

.

"లవ్వ, బొక్క,  దీన్ని ఎలా వదిలించు కోవాలీ రా దేవుడా అనుకుంటుంటే, బలే ఛాన్స్ దొరికింది,.

నన్ను ఇప్పటికే పిండేసింది, హ .. ఒక్కసారి లేచిపోదాం అనే సరికి గుండె ఆగినంత పనైంది, జీవితం మొత్తం దీన్ని ఎలా ఎగలిరా దేవుడా అని బయపడ్డ,

మొత్తానికి వదిలించుకున్న, హ. ఇది నన్ను వదిలేసింది అని చెప్పి దీని Friend ని లైన్ లో పెట్టుకుంటా.

అమెరికా నుండి వచ్చినపుడు దీన్ని వాడుకుంటా.. సరిపోద్ది." అని నవ్వుతూ నవ్వుతూ మళ్ళీ బాధపడుతూ, ఏడుస్తూ వుంటాడు.

ఇద్దరు పైకి లేచి ఎడుస్తున్నట్టు నటిస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ, చేతులు వదిలి వెనక్కి నడుచుకుంటూ వెళుతూ తిరిగి ఒకరిని ఒకరు చూసుకుంటూ వెళుతుంటారు వెనక్కి తిరిగిన రాజేష్ పెద్దగా అరుస్తూ,

"నువ్వు ఎక్కడ వున్న సంతోషంగా వుండాలి, అదే ఈ నిజమైన ప్రేమికుడి కోరిక .. By

వెనక్కి తిరిగిన స్వప్న "ఈ శరీరమే నిన్ను వదిలి వెళుతుంది, నా మనసు నితోనే వుంటుంది, నిలోనే వుంటుంది. By by .. అని వెనక్కి నడుచుకుంటూ, టాటా చెప్పుకుంటూ, తలవవైపు తిరిగి వెళ్లిపోతారు..

.

The End

ఇదో రకం – Breakup (అన్నీ BreakUp లు ఒకేలా వుండవు )


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్