జ్ఞాపకాలు లేనీదే మన జీవితం ఒక శూన్యo ,అలాగని ప్రతి చిన్న ఙ్ఞాపకాన్ని గుర్తుంచుకోవడం సాధ్యమా?
కచ్చితంగా సాధ్యం అని చెప్పలేం . కబట్టి, మనం ఎదో ఒక విధంగా మన జ్ఞాపకాలను దాచుకున్నట్లైతే రేపటి రోజున వాటిని నెమరు వేసుకోవడం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
మరి దాచి పెట్టుకోవడం ఎలా? చాలా సులభం!
మీ జ్ఞాపకాలని భద్రంగా దాచిపెట్టుకునేందుకు అవకాశాన్ని స్టోరీ మిర్రర్ మీకు అందిస్తుంది!!
ప్రతి వారం కొన్ని అంశాలను ఇస్తాము , ఆ అంశాల మీద మీ కథ, లేదా కవితను సబ్మిట్ చేయండి. ఎవరికి తెలుసు? మీ రచనలు ఎంత ప్రభావితం చేయగలవో...
మారేందుకు ఆలస్యం? మీ కలంతో మీ జ్ఞాపకాన్ని రచించడానికి సిద్దంకండి !!
నియమాలు:
- రచన యొక్క పేరు ఆరోజు అంశం పేరు పెట్టకూడదు.
- అంశాలు ప్రతి వారం ఇవ్వబడుతుంది కాబట్టి రోజును బట్టు అంశాన్ని అనుసరించవలసిందిగా మనవి
- అన్ని రకాల కథలు, కవితలు స్వీకరిస్తాము
- జోనర్ గురించి ఎలాంటి నియమాలు లేవు
- పోటీ లో రచనలు అక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి
- పాల్గొనే వారు తమ స్వంత రచనలు మాత్రమే పంపాలి
- ఎన్ని రచనలైనా పంపచ్చు
- స్టోరీ మిర్రర్ లో ఇది వరకే సబ్మిట్ చేసిన రచనలు మళ్ళీ పోటీకి పెట్టకూడదు
- స్టోరీ మిర్రర్ యజమాన్యానిదే తుది నిర్ణయం
- వ్యాసాలు లేదా ఆర్టికల్స్ పోటీ కి స్వీకరింపబడవు
బహుమతులు:
- 15 రోజుల అంశాల మీద పోటీ కి రచనలను సబ్మిట్ చేసిన రచయితలకు ఒక పుస్తకం బహుకరింపబడుతుంది.
- మొత్తం అన్ని రోజులు రచనలను సబ్మిట్ చేసిన రచయితలకు స్టోరీమిర్రర్ ట్రోఫీ అందజేయబడుతుంది
- దయచేసి గమనించండి, రోజువారీ అంశాలు కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది.
- 10 రకాల రచనలు పది కధాంశాల పై ఒకే రోజు ప్రచురించినవి బహుమతి కి అర్హమైనవి కాదు.
- పది రకాల రచనలు ఒకే కధాంశం పై వేర్వేరు రోజులు ప్రచురిస్తే కూడా బహుమతి కి అనర్హమైనవి గా పరిగణిస్తాము.
- .పాల్గొన్న వారందరికీ participation certificate ఇవ్వబడుతుంది.
అర్హత:
పోటీ డిసెంబర్ 1,2019 నుండి డిసెంబర్ 31 ,2019 వరకు ఉంటుంది
పుస్తకాలు గెలుచుకున్న వారి వివరాలు జనవరి 20,2020 న ప్రకటిస్తాము.
భాష : తెలుగు
రచనా విభాగం : కథలు/ కవితలు
సంప్రదించవలసిన వారు: marketing@storymirror.com/ 022-49240082 / 022-49243888