STORYMIRROR

#Winter Writing Contest

SEE WINNERS

Share with friends

స్టోరీ మిర్రర్ వింటర్ రైటింగ్ పోటీకి స్వాగతం! మీ సృజనాత్మక ఆలోచనలు మా వేదిక ద్వారా మీరు పంచుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నాము. శీతాకాలం అంటేనే ప్రకృతి మాయాజాలం. ఈ ప్రత్యేక సమయంలోని విభిన్న అంశాలను మీ కథనాలు ప్రతిబింబించేలా ఉండాలని మేము ఈ వింటర్ రైటింగ్ కాంటెస్ట్ ద్వారా కోరుకుంటున్నాము.


అంశాలు:

శీతాకాలపు గుసగుసలు: శీతాకాలపు నిశ్శబ్ద క్షణాల గురించి మాకు మీ కథల ద్వారా చెప్పండి. అవి మంచు కురుస్తున్న మృదువైన శబ్దాలు కావచ్చు లేదా చల్లటి రాత్రి యొక్క ప్రశాంతత కావచ్చు. శీతాకాలపు నిశాంత మౌన నిశ్శబ్దాన్ని , శీతాకాలపు అందాన్ని మాకు మీ కథనాలతో చూపించండి.

అతిశీతలమైన ఊహా ద్వీపం: శీతాకాలం మంత్రముగ్ధులను చేసే అద్భుతమయిన ప్రపంచాన్ని ఊహించుకోండి. స్నోఫ్లేక్స్ లేదా ప్రత్యేక శక్తులతో మంచు మాట్లాడటం వంటి ఫాంటసీ అంశాలతో కథను వ్రాయండి. ఫాంటసీ వింటర్ ల్యాండ్‌కి మమ్మల్ని తీసుకెళ్లండి!

ఫైర్‌సైడ్ క్రానికల్స్: హాయిగా ఉన్న చల్లని రాత్రి, వెచ్చటి చలిమంట చుట్టూ జరిగే హృదయాన్ని కదిలించే కథలను మా వేదిక ద్వారా పంచుకోండి. ఇది కుటుంబ సమావేశాలు, స్నేహపూర్వక ఊసులు లేదా చలికాలం ప్రత్యేకంగా వేసుకునే చలిమంట వెచ్చదనం, ఏదైనా కావచ్చు. మీ కథల ద్వారా పంచుకోండి.

వింటర్ వాండర్లస్ట్: శీతాకాలంలో తెలిమంచు కరిగే వేళ ఆరుబయట మీ జ్ఞాపకాలు, అనుభవాలు అన్వేషించండి. మంచు పర్వతాలలో సాహసాలు లేదా ఘనీభవించిన సరస్సుల, హిమానీ నదాల అందం గురించి వివరించండి. శీతాకాలపు ప్రకృతి దృశ్యం కథలో భాగమయ్యే ప్రయాణంలో మమ్మల్ని తీసుకెళ్లండి.


ప్రతిబింబం యొక్క సీజన్: శీతాకాలం యొక్క ఆలోచనాత్మకమైన, ప్రేరణాత్మకమైన భాగాన్ని మాకు చూపండి. మీ కథనం ఎవరైనా ఈ సీజన్‌లో జీవితం, ప్రేమ లేదా వ్యక్తిగత ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. శీతాకాలం తెచ్చే ప్రతిబింబ క్షణాలను కథల్లో అందంగా మలచండి.


నియమాలు:

మీరు ఇచ్చిన థీమ్‌పై వ్రాయాలి

పోటీ లో పాల్గొనేవారు తమ స్వీయ రచనను మాత్రమే సమర్పించాలి.

రచనల సంఖ్యకు పరిమితి లేదు.

పదాలు, రచనల నిడివి పై ఎలాంటి పరిమితి లేదు.

 పోటీలో పాల్గొనే రుసుము లేదు.

రచనల నాణ్యత ఆధారంగా పోటీలో విజేతలు నిర్ణయించబడతారు.


కేటగిరీలు: కథ, కవిత & ఆడియో

భాషలు:

వీటిలో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కంటెంట్‌ను సమర్పించవచ్చు - ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా & బెంగాలీ

బహుమతులు:

  • ప్రతి భాష మరియు కేటగిరీలో టాప్ 10 కథలు మరియు కవితలు మరియు రూ.149 విలువైన స్టోరిమిర్రర్ డిస్కౌంట్ వోచర్ మరియు డిజిటల్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ పొందుతారు. గెలుపొందడానికి పరిగణించబడే కొలమానం మా సంపాదకీయ బృందం ద్వారా ఎడిటర్ స్కోర్‌లు.
  • టాప్ 4 కథనాలు & కవితలు మా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబడతాయి
  • పాల్గొనే వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందుతుంది.


సమర్పణ దశ – జనవరి 08, 2024 నుండి జనవరి 31, 2024 వరకు ఫలితాల ప్రకటన:

సంప్రదించండి: ఫిబ్రవరి 28, 2024

ఇమెయిల్: neha@storymirror.com

ఫోన్ నంబర్: +91 9372458287