namith chandra

Children Stories

4.6  

namith chandra

Children Stories

స్నేహం

స్నేహం

3 mins
1.8K


                

అనగనగా ఒక ఊరిలో రాము, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు . వారిద్దరూ కలిసి ఆడుకొనేవారు ,చదువు కొనేవారు ,సైకిల్ తొక్కేవారు ,ఇతరులకు సహాయం చేసేవారు. వారిద్దరూ బాగా చదివి తరగతిలో ప్రధమ శ్రేణిలో

వచ్చేవారు. రాము, రవి వాళ్ళ కుటుంబాలు కూడా స్నేహంగా ఉండేవారు. రాము వాళ్ళది ఉమ్మడికుటుంబం కావడం వల్ల వాళ్ళ నానమ్మ, తాతయ్య వాడికి రామాయణం , మహా భారతం కథలు చెప్పేవారు. రవిది చిన్న కుటుంబం కావడం వల్ల వాడు ఒక్కడే ఆడుకొనే వాడు. ఒకరోజు రవి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి కొత్త ఫోన్ కొని ఇచ్చాడు . రవి సాయంత్రం బడి నుండి వచ్చాక కొంతసేపు ఫోన్ లో జోక్స్ చూసేవాడు. ఆలా కొన్ని రోజులు అయ్య్యక రవికి ఫోన్లో గేమ్స్ ఆడడం అలవాటుగా మారింది. అప్పటినుండి రాముతో ఆదుకోవడానికి ,చదువుకోవడానికి వెళ్ళేవాడు కాదు. క్రమంగా రాముతో స్నేహం తగ్గించేసాడు. రాము రవితో మాట్లాడదామని వెళ్లేసరికి వాడు రాముని చూసి చూడనట్టుగా వేరే స్నేహితులతో గేమ్స్ గురించి మాట్లాడుతూ వెళ్లిపోయేవాడు..రాము ఒక రోజు రవి వాళ్ళ ఇంటికి వెళ్లి రవితో నువ్వు ఈ మధ్య సరిగా చదవడంలేదు మార్కులుకూడాసరిగాతెచ్చుకోవడంలేదు అదేపనిగా ఫోన్లో గేమ్స్ ఆడుతూ వాటిగురించే ఆలోచిస్తున్నావు ఇది మంచిపద్ధతి కాదు . మనం ఇలాంటి పనులుచేయడంవల్ల మన తలిదండ్రులు బాధపడతారు . 

బైటవాళ్లముందు అవమానాలాపాలుఅవుతారు అందుకని ఇప్పటినుండి నువ్వు ఆలా చేయకుండా మంచిగా చదువుకోవాలి అని హితవు చెప్తాడు . అపుడు రవి రాముని నువ్వుఎంటి నాకుచెపేది న ఇష్టం అని అవమానించి పంపిస్తాడు. ఇంకోరోజు రవి ఇంట్లోలేని సమయంలో , రాము వాళ్ళ ఇంటికి వెళ్లి రవివాళ్ళ అమ్మతో మాట్లాడుతాడు" ఆంటీ రవి ఇదివరకులాగా చదవటంలేదు ఎపుడూ గేమ్స్ గురించి ఆలోచిస్తూ దానిగురించే మాట్లాడుతూ ఉంటున్నాడు .నాతో స్నేహంగా ఉండడంలేదు . పరీక్షలు బాగా వ్రాయడంలేదు , మీరు ఫోన్ ఇచ్చి నప్పడినుంచే , రవి ఇలా మారిపోయాడు మీరైనవాడికి చెప్పండి బాగాచదువుకొనమని అనిఅంటాడు నాకళ్ళ ముందు నాస్నేహితుడు ఆలపాడైపోతుంటే ,చూస్తూ వుండలేకపోతుననుఁ అని అంటాడు . ఒక రోజు రవి గేమ్ కోసం వాళ్ళ నాన్నని డబ్బులు అడుగుతాడువాళ్ళ అమ్మానాన్న డబ్బులు ఇయ్యము ఇపుడు నువ్వు చదువుకునే వయస్సు గేమ్స్ ఆడడం మానేసి మంచిగా చదువుకో అంటారు . రవి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసి ఒక్కడే తనగదిలో ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు . కొన్ని రోజులకు ,మళ్ళీ వాళ్ళ నాన్నని డబ్బులు అడుగుతాడు .వాళ్ళనాన్న అదేమాట చెప్తాడు .రవికె గేమ్స్ పిచ్చి అతిగా ఉండడం వల్ల వాళ్ళ నాన్న మీద కోపంతో కక్షతో వాళ్ళ నాన్నని చంపేస్తాడు . ఈ విషయం పోలీసులకు తెలిసి రవిని అరెస్ట్ చేస్తారు. రవిఆవేశంలో అలాచేస్తాడుకానీ తర్వాత బాధ పడుతాడు అపుడు రాము చెప్పినమాటలు గురుతుకువస్తాయీ . నేను రాము చెప్పినపుడు వినివుంటే బాగుండేది నాన్న ని కోల్పోయిఉండేవాణ్ణికాదు అనుకుంటాడు ఈవిషయం రాముకి తెలిసి వాళ్ళ నాన్నని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళుతాడు రాము వాళ్ళ నాన్న లాయర్ అవ్వడంవల్ల స్నేహితుడికి బెయిల్ ఇవ్వడానికి వాళ్ళ నాన్న తో కలిసివెళ్తారు  రవి వాళ్ళ అమ్మ రవి మీద కోపంగా  ఉండడం వల్ల వాడిని తిట్టి బయటకు పుంపివేస్తుంది . రాము రవికి నచ్చచెప్పి వాళ్ళ ఇంటికి తీసుకువెళతాడు , రవి రాము వాళ్ళ ఇంట్లో ఉంటూ మల్లి మంచిగా చదువుకుంటూ ఉంటాడు. ఈలోగా సంక్రాంతి సెలవులు వచ్చాయి . రాము,రవి రాము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారు . ఒక రోజు రవి అన్నం పారేయబోతాడు. అప్పుడే పొలం నుండి వస్తున్న రాము వాళ్ళ తాత అది చూసి బాధపడి ఇలా చెప్పుతాడు. మీరు అన్నం పారేయడం మంచిది కాదు. అది రైతుల ఎన్నో నెలల కష్టం అని చాల మందికి తెలియదు.చాలామంది రైతులు తగినంత నీరు లేక పంటలు సరిగ్గా పండక వరదల వల్ల పంటలు అన్ని మునిగి పోయి పాడవడం వాళ్ళ నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంటలు పండించడానికి ఆరు నెలలు పడుతుంది. భూమి దున్ని, నీరు చల్లి ,విత్తనాలు వేసి పంటకు పురుగు పట్టకుండా చూసి సరైన నీరు అందించాలి. పంట పండాక వాటిని కోసి శుభ్రపరచి బస్తాలలో భద్రపరచాలి. ఇంత చేస్తేనే రైతులకి పంట చేతులకి వస్తుంది. ఇంత కస్థాన్ని మీరు వృధా చెయ్యడం తప్పు అని చెప్తాడు. అప్పుడు రవి పారేయాలనుకొన్న అన్నాన్ని తినేస్తాడు. మరుసటి రోజు రాము వాళ్ళ తాత వాళ్ళిద్దరిని పొలం దగ్గరికి తీస్కెళ్లి చూపిస్తాడు అప్పటినుండి వాళ్లిదరు అన్నం వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండే అందరికి కూడా అన్నం విలువ చెపుతారు .రవి,రాము బాగా చదివి ఒక పెద్ద ఫోన్ కంపెనీ స్థాపించి ఫోన్లో పిల్లలకి ఉపయోగపడే విజ్ఞానము ,నైతిక విలువలు ,మంచి అలవాట్లు , ఇతిహాసాలు,రామాయణ, మహాభారతాలు, ప్లే స్టోరీలో అప్ లోడ్ చేసి మంచిమాత్రమే వచ్చేలా తయారుచేస్తారు ఏవ్ బాగా అమ్ముడు అవుతాయి వాటిలో వచ్చిన లాభం తో సగం కంపెనీ అభివృద్ధికి , సగం రైతులకి విరాళంగా ఇచ్చి మంచి వారీగా పేరు తెచ్చుకుంటారు .రవి మంచిగా ఎదిగి వాళ్ళ అమ్మ దగ్గరుకు వెళ్లి క్షమాపణ అడుగుతాడు .రవి తప్పుదారిలో వెళ్లకుండా మంచిగా ఎదగడం చూసే వాళ్ళమ్మ అతనిని క్షమించి, తన కొడుకుని మంచి దారిలో నడిపించి మంచి స్థాయిలో నిలపెట్టినందుకు రాము వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియచేస్తుంది. రాము నువ్వు ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల నీకు మంచి చెడు నైతిక విలువలు తెలిసాయి అందుకే నువ్వు మంచిగా ఎఅబ్గాహ్ఈఈ ఎప్పటినుండి మేము కూడా ఉమ్మడికుటుంబముగా ఉండి ముందు తరలవాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాం అని చెప్పింది . 


ఇప్పటియువత మొబైల్స్ సక్రమం గ వాడక పాడైపోతున్నారు. తల్లితండ్రులు వారిని సరైన మార్గంలో నడిపించాలి ,సరైన జాగ్రత్తలు తీసుకోవాలి 




                                                                                                       


Rate this content
Log in

More telugu story from namith chandra