STORYMIRROR

MohanKrishna Landa

Children Stories

4.5  

MohanKrishna Landa

Children Stories

ఓ మేఘమా!!

ఓ మేఘమా!!

1 min
275


 ఆట కోసం అలమటిస్తున్న ఆ చిన్నారులకు ఈ మండుటెండల మద్దెలదరువు సమంజసమా? 

ఓ మేఘమా! ఈ బాలురు కోసం ఆ భానుడిని కాసేపు బుజ్జగించరాదా అని అమ్మ వాపోయింది...


పున్నమి వెన్నెల వెలుగులో ప్రకాశిస్తున్న చుక్కలను చూసి ముసిముసి నవ్వులు కురిపిస్తున్న ఈ‌ చిన్నారులకు అంధకారం అ‌సమాన్యం...

ఓ మేఘమా! ఈ పసికందుల కొరకు నీ కారుమబ్బులు కారాగారం నుంచి ఆ జాబిలిని విడిపించమని అమ్మ అర్థించింది.


తల్లి ప్రేమకి తన్మయించిన మేఘాలు, ఆమె అర్జీలను అనుసరించాయి...


Rate this content
Log in

More telugu story from MohanKrishna Landa