STORYMIRROR

Ayushman gouda

Children Stories

4  

Ayushman gouda

Children Stories

గుడ్డిగాఅనుసరించడంమంచిదికాదు

గుడ్డిగాఅనుసరించడంమంచిదికాదు

1 min
262

  


ఒక రోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేప తోసహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకు న్నాడు. అలా కొన్ని దోసిళ్లు తీసుకున్నాడు. శిష్యులూ తమ గురువు చేసినట్టు చేశారు. కాని గురువు ఏమీ అన కుండా ముందుకు వెళ్లిపోయాడు.


అలా వెళుతూండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒకొక్కక్కటి బయటికి తీసి చెరువులో వేయడం మొదలు పెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారూ అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటికి తీసుకురాగలిగారు.


అప్పుడు గురువు ఇలా అన్నాడు, "ఓరి బుద్ధిహీను ల్లారా! కడుపులో చేపల్ని సజీ వంగా ఉంచడం చేతకాలేదా. అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు?"అందుకే అన్నారు. దేన్నీ గుడ్డిగా అను సరించరాదు అని!


Rate this content
Log in