ఆత్రుత
ఆత్రుత


మన కథలో పాత్రధారి ఒక విమానం లో అట్టెండర్, ఒకానొక దినమున తను విమానం పైలట్ క్యాబిన్ అద్దములు తుడుస్తున్నపుడు ఒక పుస్తకం కనబడినది. పుస్తకం యొక్క శీర్షిక " విమానం నడిపించిన ఏలా (మొదటి భాగము) .
అతను పుస్తకం తెరిచి చదవడం ప్రారంభించాడు. పుస్తకంలోని మొదటి పేజీ లో ఇలా వ్రాసి ఉంది. " విమాన ప్రయాణంలో యంత్రం మొదలు పెట్టడానకి మొదటగా ఎరుపు రంగు షయల్తీ బటన్ నొక్క వలెను " అతను అలాగే చేశాడు, యంత్రం ఆరంభం అయ్యింది.
అతను ఆనందముతో పుస్తకం యొక్క రెండవ పేజీని తెరిచాడు. అందులో ఇలా వ్రాసి ఉంది " విమానం కదులుటకై ఆకుపచ్చని రంగు గల బటన్ నొక్క వలెను ". అతను అలాగే చేశాడు విమానం కదిలింది, కాసేపటికి పరుగులు తీయడం ప్రారంభించింది.
అతను సంభ్రమాశ్చర్యాలకు లోనై పుస్తకం ముాడవ పేజీని తెరిచాడు. అందులో ఇలా వ్రాసి ఉంది " విమానం ఎగురుటకై పసుపు వర్ణముగల బటన్ నొక్క వలెను ". అతను అలాగే చేశాడు విమానం ఎగరటం ప్రారంభించింది. ఇప్పుడు అతని ఆనందానికి హద్దులు లేవు.
అలాగే పదిహేను నిమిషాల గగన విహారం తరువాత అతను విమానం ల్యాండ్ చేయాలని పుస్తకం తరువాత పేజీని తెరిచాడు. ఆ పేజీలో ఇలా వ్రాసి ఉంది " విమానం ల్యాండ్ చేయటానికి పుస్తకం యొక్క రెండవ భాగమును మీకు దగ్గరలోని కొట్టులొ కొనుగోలు చేయండి."
నీతి: పుార్తి పరిజ్ఞానం లేనియెడల ఏ కార్యములను ఆరంభించరాదు.