“
"నవమాసాల పురిటి నొప్పుల ప్రసవ వేదన
బాధను మరిచి,
బాధ్యతగా భరించి,
నిన్ను ఈ సృష్టికి పరిచయం చేసి,
నీ రోదన విన్న ఆ క్షణం ..
అప్పటివరకు తన మనసు మాటున ముడివేసుకున్న దుఃఖాన్ని, కొండంత సంతోషంతో జయించి,
తన తడిసిన కనుల ద్వారా ధారగ జారిన ఆ ఆనంద భాష్పాల,
తన మురిసిన పెదవుల పై పూసిన ముసి ముసి నవ్వుల పువ్వులే కదా మాతృత్వం"
”