"క్యాలెండర్" మారినప్పుడల్లా "క్యారెక్టర్" మార్చేస్తున్న ఈ మనుషుల మధ్యలో ఒకే "కమిట్మెంట్" తో ఇంకా బ్రతికేస్తున్నానా...? "ఎలా?" "ఎందుకు?" అని అడిగే ప్రశ్నలకు జవాబులు లేకపోవచ్చు, "ఎంత గొప్పగా?" అన్న ప్రశ్నకు మాత్రం నా నిలకడే పైకి చెప్పలేని ఓ సరైన సమాధానం !
గుర్తుపెట్టుకో🫵... నువ్వెంత సేవ చేసినా, మరెంత సాయం చేసినా... సమాజం నిన్ను గుర్తించేది కేవలం నీ సంపాదన బట్టే !
అదేదో విధి అట ! "భరించేవాడికి నిద్ర మర్చిపోయిన రాత్రులనిచ్చింది ! బెదిరించేవాడికి రాత్రికి రాత్రి మార్చిన రాతలనిచ్చింది !" @mr.satya's_writings✍️
“కెరీర్ కోసం నేర్చుకున్న పాఠాలు డిగ్రీ వరకే నడిపించాయ్, జీవితం నేర్పిన పాఠాలు మాత్రం… పీహెచ్‌డీ చేయించాయ్ !"