గాంధీని గాడ్సే ఎలా చంపాడో.. విడమర్చి మరీ చెప్పిన మన పాఠ్య పుస్తకాలు, ఎందుకు చంపాల్సివచ్చిందోనన్న కారణం మాత్రం... ఎందుకు వివరించి చెప్పలేకపోయాయి?
“కన్న కలల గమ్యం వేరు, కదులుతున్న జీవితపు మార్గం వేరు... మోయక తప్పని బాధ్యతల బరువు... భుజాలకు బలం తప్పక నేర్పదా ?”
“ఒకసారి వద్దని వదిలేశాక, మళ్లీ వెనక్కి తిరిగి చూస్తే… మన మనసు ఓడిందని, మన బలహీనతే గెలిచిందని” @mr.satya's_writings✍️
కథ... కాగితంపై రాస్తే అందంగానూ... పుస్తకంలో చదివితే ఆనందంగానూ... భావాల్లో వివరిస్తే ఆహ్లాదంగానూ... మాటల్లో వినిపిస్తే మధురంగానూ ఉంటుంది. కానీ… అదే కథను గుండెల్లో మోసేవాడికి, అదో మోయలేని బరువు… దించుకోవాలనుకున్నా దించుకోలేని భారం!
ఆమె అడిగిందట "నన్ను మర్చిపోయావా ? లేక నువ్వు మారిపోయావా ?" అతను ఇలా బదులిచ్చాడట... "నల్లటి పలకపై రాసుకున్న తెల్లని అక్షరానివనుకున్నావా నువ్వు.. చెరిపేస్తే చెరిగిపోవడానికి, మనసు పలకపై రాసుకున్న మర్చిపోలేని ఙ్ఞాపకానివి !"
కులమే బలం, జాతే నీతి, మతమే హితం అని ఊరికే ఊరిలో ఊరేగే ఓ పెద్ద మనిషి ! రేపు, నీ పాడే మోసేదెవడు ? నీ కట్టే పేర్చేదెవడు ? నీ వాళ్ళ కన్నీళ్లు తుడిచేదెవడు ?"