గురుకుల విద్యాలయం
గురుకుల విద్యాలయం


ఆలయం దేవాలయం ఆలయం దేవాలయం
పసి పిల్లలను పౌరులు గా మలిచె మహిమాలయం
సమత మమత నవత ల గురుకుల విద్యాలయం
కోటి కోటి చూపులు వెలిగించే దీప తోరణం
మానవతా స్నేహాసుధాలు పలికే నవ భావనం
అజ్ఞానం చీకటి తొలగించి దీపాలయం
గతుకులు లేని ప్రయాణం కాదు మా అందరది
పడి లేచే బ్రతుకులే మా అందరవి
కన్న కలలు వేరయిన చేసే కష్టం ఒకటే
సాగే దారులు వేరయిన చేరే తీరం ఒకటే
అదే అదే అదే అదే మా విద్యాలయం
గురుకుల విద్యాలయం పవిత్రమైన ఆలయం.