కరోనా కలకలం
తీరని అంతరాయం
డాక్టర్ల సాహసం
పోలిసుల సామర్ధ్యం
రైతుల సావాసం
మానవుల సహనం
మీ అందరికి వందనం 👏
🌷విజయ🌷
కోయిల స్వరం ఆనందించే గానం
వేపపూత ఆయుర్వేదికా మాత
మామిడి ఆకు అలంకరణకు తొలి మెట్టు.
🌷విజయ 🌷
శ్రమించేది ఒకరు
అనుభవించేది మరొకరు
జయించేది అన్యాయం
భరించేది న్యాయం.
🌷విజయ 🌷
అమ్మ ప్రేమ అంతులేని ప్రేమ;
అమ్మ మనసు స్వచ్ఛమైన మనసు;
అమ్మ పిలుపు తేనెల పలుకు;
అమ్మ అనే బంధం ఆత్మీయ బంధం.
#విజయ
మాటలతో మురిపించకు
సహాయానికి వెల కట్టకు
మంచితనానికి పునాది కట్టు
శత్రువు నకు చేయూతనివ్వు.
#విజయ
విజయం వజ్రం లాంటిది
అనుకుంటే వచ్చేది కాదు
సాధించాలంటే సాధన తప్పనిసరి.
#విజయ
మహిళ ఒక అద్భుత మహిమ;
మహిళ లేనిదే ప్రపంచం లేదు;
మహిళ లేని చోట ప్రపంచం అంతం;
మానవుల్లో మహిళత్వం ఒక అద్భుతం;
మహిళగా సాధించి మానవులకి ఆదర్శంగా నిలవడం గర్వకారణం;
మహిళ ప్రతిభా ఫలం, సిరి సంపదలకు మూలం;
మ - ముందు చూపుతో
హి -హింసను ఎదురించి ముందుకు సాగుతు
ల - లాలించే హృదయం.
# విజయ
నిజాయితీ ఒంటరి పక్షి,
అబద్ధం ఆత్మీయత పక్షి,
నిజాయితీతత్వం నీచపుతనం,
అబద్ధపుతత్వం ఆత్మీయ బందం,
నిజాన్ని అనుమానించడం
అబద్ధాన్ని ఆకర్షించడం
మానవుల సహజ లక్షణం.
రిటన్ బై మీ#విజయ✍