స్వచ్ఛమైన నీరు
ప్రపంచంలోనే
మొదటి ఔషధం
మన ఆత్మ జ్ఞానం
వినపడాలంటే
దట్టమైన అడవిలోకి
షికారు వెళ్ళాల్సిందే!!
ఇతరులతో పోల్చుకోడం మానేస్తే
మనం సంతోషంగా ఉండగలం!!
మనం ప్రతి ఒక్కరికి సహాయం చేయలేక పోవచ్చు కానీ
ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి సహాయం చేయగలరు!!
ఒక సరైన ప్రశ్న అడగడం అంటే
సమాధానం చెప్పడం కంటే కూడా చాలా కష్టం !!
సన్నని ఇసుకలో
మన పాద ముద్రల్ని
చెరిపేస్తూ
మన జీవిత అల్పత్వాన్ని
గుర్తు చేస్తూ
ఎగిసి పడే అలలతో
ప్రశాంతంగా కనిపిస్తుంది
కల్లోల సముద్రం!!
మనకు కొత్త ప్రపంచాన్ని
చూడలనిపించినప్పుడల్లా
కొత్త పుస్తకం తెరిచి చూస్తే చాలు
మరణం అనేది జీవితానికి వ్యతిరేకము కాదు
జీవితంలో ఒక భాగం.
జీవితం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది
మనం చేయాల్సిందల్లా ఆస్వాదించడం, అనుభవించడం అంతే!!!