సృష్టించే శక్తి పోషించే సహనం స్త్రీ జాతి సొంతం...
సృష్టించే శక్తి పోషించే సహనం స్త్రీ జాతి సొంతం...
తేనె బువ్వ పాపాయికి హాయి...తెలుగు పలుకు మనసుకు హాయి
అమ్మ లాలి పాట...బుజ్జాయి కి లాలన... నీ ఎద సవ్వడి...నా శ్వాసకు సాంత్వన
ఎద సవ్వడి మొదలై అమ్మపాల కోసం నువ్వు తీసే రాగం...జననం...
నీ శ్వాస మూగబోయాక నలుగురు నీ కోసం మౌనంగా పలికే కన్నీటి రాగం మృత్యువు...
వీటి మధ్య చిరునవ్వు సంగీతంతో జీవితాన్ని ఆనంద రాగం గా మలుచుకో...
అల్లరి హద్దుల్లో ఉంటే అందంగా ఉంటుంది...అతి ఐతే జీవితం అల్లరి పాలు అవుతుంది
సిరా మరకలు... గీతలు...నిండిన గోడలు...అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు...అల్లరి చేసే పిల్లలు...కొన్నాళ్ళకి బోసి పోయిన గూటిలో జంట గువ్వలకు...తియ్యని గుర్తులు
జీవితం అనే పయనంలో...ఆశ మాత్రమే అసలైన నేస్తం...
ప్రేమంటే ఒక రోజు హడావుడి తో ముగిసే ఆకర్షణ కాదు...జీవితం అంతా ఒకరి కోసం ఒకరు నిలబడే ఆర్తి...అనురాగం...