❤️❤️ నా కలం పేరు ... సిరి ✍️❤️❤️ రాస్తున్నాను బాధ తోఒక్క కవిత ఈ పూట కవితగా వినిపిస్తున్నాను నిన్ను కోల్పోయిన నా నమ్మకం నువ్వు నాతో సంతోషంగా ఉన్నావు అనుకున్నాను కానీ నీకు నువ్వే శిక్ష నీ ఆలోచనే నా కవితకు ఊపిరి అనుకున్నా నా కవిత ఆగదు లే ఇక్క .. నా మనసులో భావాలకే నీ గుండె లో గుడికట్టి ... Read more
Share with friendsఓడిపోతే తల వంచకు, గెలిస్తే తల ఎత్తకు.. రెండూ నీకు పాఠాలే నేర్పుతాయి. నిన్నటి కష్టం నేటి నీ అనుభవం, నేటి ఓర్పు రేపటి నీ సామ్రాజ్యం.
కన్నీటి శిలాశాసనం నా హృదయం ఒక రాయలేని కవిత, కన్నీళ్లు దానిపై పడిన సిరా చుక్కలు. ఎవరు స్పృశించలేని ఈ వేదన, నా ఆత్మకు వేలాడుతున్న ఒక ఉరితాడు.
కాలం ఎంత వేగంగా కదిలిపోయినా, నీ జ్ఞాపకం మాత్రం నాలో ఆగిపోయింది. మనం కలవని ఈ దూరం కూడా, నీపై నాకున్న ఇష్టాన్ని ఇంకా పెంచింది
ప్రేమలో విడిపోవడం అంటే ప్రాణం పోవడం కాదు.. బతికుండగానే మనలోని సగ భాగాన్ని ఎవరైనా కోసేసినట్టు! కంటికి కనిపించని ఈ గాయం నుండి, రక్తం బదులు కన్నీళ్లు కాదు.. నిశ్శబ్దం కారుతోంది. నువ్వు లేని క్షణం ఒక యుగమై నన్ను మింగేస్తుంటే, నీ జ్ఞాపకం మాత్రం నన్ను చావనివ్వకుండా కాపాడుతోంది.
పెదవులు దాటని మాటలెన్నో ఉన్నాయి, నీ చూపులు చదివితేనే అవి అర్థమవుతాయి. భాష లేని బంధం మనది, మౌనంలో కూడా ప్రాణం పోసుకుంటుంది.
నన్ను నేను వెతుక్కునే లోపే, నన్ను నేను కోల్పోయాను నీవు చూపిన వెలుగులో కాదు... ఆ వెలుగు వెనుక ఉన్న చీకటిలో. నువ్వు నా ప్రాణం అన్నావు, కానీ నీ ప్రేమ ఒక వల అని తెలియలేదు నేను అందులో చిక్కుకున్నాక గానీ అర్థం కాలేదు, నేను బందీనని.
ప్రతి అలలో ఒక జ్ఞాపకం.. ప్రతి నురుగులో ఒక నిట్టూర్పు.. ఎగసి పడేది ఆశ కోసం కాదు, తీరని వ్యధను ఒడ్డున పారేయడం కోసం
కన్నీటి కడలిలో కదిలే కెరటాలు.. గుండె లోతుల్లోని గాయాల ప్రతిధ్వనులు! ఒడ్డుకు చేరితే తీరుతుందనుకున్న ఆవేదన, మళ్ళీ వెనక్కి లాగే విధి రాతల సుడిగుండం.