ప్రశ్నించే గొంతు మౌనం వహిస్తే
సమస్య సమస్యగానే మిగిలిపోతుంది
ప్రశ్నించడం మొదలుపెడితే
విమర్శలను ఎదుర్కోవాలి
విమర్శను అధిగమించాలి అంటే
అపార విజ్ఞానం సొంతం అవ్వాలి
ఆ విజ్ఞానం కొంతమందికైనా కనువిప్పు తేవాలి
జీవిత కాలం నువ్వే అవతలి వారిని
అర్థం చేసుకున్నా కూడా
నిన్ను అర్థం చేసుకునే వారే కరువవుతారు
నీకు నేను నలుగురిలో ఒకరే కావచ్చు కానీ
నా మనసులో నీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకం
నిన్ను ఇంకొకరితో పోల్చుకోలేను అలాగని
నా మనసులో నుండి తీసేయనూలేను
గొంతు చించి బాధను బయటకు చెప్పలేను