Check out my latest episode!
Happy Sarannavaraatri festival wishes to all of you
07.10.2021 గురువారం
*శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు*
సుప్రభాతం...........
ఈరోజు *ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పాఢ్యమి* తిథి .
ఈరోజు నుండి దక్షిణభారత పంచాంగముల ప్రకారం *ఆశ్వయుజ మాస శుక్ల పక్షం* ప్రారంభం అవుతుంది.
సంవత్సరం లో నాలుగు సందర్భాలలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అవి 1. వసంత నవరాత్రులు 2. ఆషాఢ నవరాత్రులు 3. శరన్నవరాత్రులు 4.మాఘ నవరాత్రులు.
1. *వసంత నవరాత్రులు* చైత్ర మాసం,వసంత ఋతువులో ఉగాది నుండి ప్రారంభం అవుతాయి.
2. *ఆషాఢ నవరాత్రులు* ఆషాఢ మాసం శుక్ల పక్ష పాడ్యమి నుండి ప్రారంభం అవుతాయి. వీటినే *గాయత్రీ నవరాత్రులు, శాకాంబరీ నవరాత్రులు,వారాహీ నవరాత్రులు* అని కూడా పిలుస్తారు.
3. *శరన్నవరాత్రులు* ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. నాలుగు నవరాత్రులలో మిక్కిలి ప్రాధాన్యత కలిగి హిందువులు ఆచరించే పండుగ. శరదృతువులో జరిగే పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అని, శారదా నవరాత్రులు,మహా నవరాత్రులు అని పిలుస్తారు
4. *మాఘ నవరాత్రులు* మాఘమాసంలో, శిశిర ఋతువు లో ఈ నవరాత్రులు జరుగుతాయి. వీటిని శిశిర నవరాత్రులు అని కూడా పిలుస్తారు.
*శారదా నవరాత్రులు* ఈరోజు నుండి ప్రారంభం అవుతాయి.శారదా నవరాత్రుల ప్రారంభ సూచనగా ఈరోజు *కలశ స్థాపన* జరుగుతుంది. చిత్తా నక్షత్రంలో లేదా వైధృతి యోగంలో కలశ స్థాపన చేయకూడదు అని కొందరి అభిప్రాయం. కలశ స్థాపన పగటిపూట మొదటి మూడవ భాగంలో పాఢ్యమి తిథి పూర్తి అయ్యేలోపు చేయాలి. అందుచేత అభిజిత్ ముహూర్తంలో (పగలు 11.40 నుండి మధ్యాహ్నం 12.28) కలశ స్థాపన చేయడానికి అనుకూలమైన సమయం.
*నవ దుర్గా సాంప్రదాయం* ప్రకారం ఈరోజు భక్తులు దుర్గాదేవిని, *శైలపుత్రి* అవతారంలో పూజిస్తారు. శైలపుత్రి అంటే పర్వత రాజు కుమార్తె అని అర్థం. సతీదేవి, పార్వతీ, హేమావతి,భవానీ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ప్రకృతి రూపంలో ఉండే ఈ శక్తి నంది వాహనం మీద కూర్చొని ఒకచేతిలో త్రిశూలం,మరొక చేతిలో పూవుతో, తలపై అర్ధ చంద్రుడిని ధరించిన రూపం గా పురాణ వచనం.
*నవ దేవీ సాంప్రదాయం* ప్రకారం ఈరోజు భక్తులు *శ్రీ బాలా త్రిపురసుందరి దేవి* ని పూజిస్తారు.
*దశ మహావిద్య* ల ప్రకారం ఈరోజు భక్తులు *శ్రీ మహాకాళీ* అమ్మవారిని పూజిస్తారు. తమ జాతక చక్రంలో శని దోషం ఉన్నవారు గోచార శని ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఈరోజు శ్రీ మహాకాళీ అమ్మవారిని పూజించడం వలన గ్రహ దోష నివృత్తి జరుగుతుంది.
*సప్త మాతృకల* సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు *బ్రాహ్మణి* అమ్మవారిని పూజిస్తారు.
విజయవాడ కనక దుర్గాదేవిని ఈరోజు *స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి* రూపం లో భక్తులు పూజిస్తారు. శ్రీ M.viswanath gaaru చెప్పిన సంచిక లోని వివరాలు..పై వ్యాఖ్యానం చేశాను. వారికి నా ధన్యవాదాలు..
Check out my latest episode! Let us try to unde
Check out my latest episode!
Its always h
Check out my latest episode!
Let us know
“This podcast was created on Hubhopper studio.
Check out my latest episode: శి వో హం శి వో హం
Check out my latest episode!