పరిచయం
మీ రచనా నైపుణ్యం పెంచుకోవడానికి మీకొక సవాలు కావాలా?
మీ సమాధానం అవును అయితే మీరు సరైన చోటుకే వచ్చారు స్టోరీ మిర్రర్ నాన్ స్టాప్ నవంబర్ పేరుతో సవాలు విసరడానికి సిద్ధం అయింది.
ఇది పోటీ కాదు కేవలం సవాలు మాత్రమే కాబట్టి విజేతలు ఉండరు, కానీ మీకు పుస్తకం గెలుచుకునే అవకాశం ఉంది.
ప్రతిరోజు ఒక కొత్త కధాంశం తో మొత్తం 30 రోజులు ముప్పై కధాంశాలు మీ పైన చిత్రం లో పేర్కొన్నాము. ఆరోజు కధాంశాన్ని చూసుకుని ఆ అంశానికి తగ్గ రచనను ప్రచురించండి.
ఇంకెందుకు ఆలస్యం? రాయండి, రాయండి మరియు రాస్తునే ఉండండి.
# నాన్ స్టాప్ నవంబర్
నియమాలు:
- మీ రచన కథ లేదా కవిత యొక్క శీర్షిక ఆరోజు కధాంశం పేరు తో ఉండకూడదు.
- అన్ని కధాంశాలు మీ పైన ఉన్న చిత్రం లో ఉన్నాయి కాబట్టి దయచేసి తేదీ ప్రకారం అనుసరించవలసింది గా ప్రార్ధన.
- అన్ని రకాల కవితలు మరియు కథలు తీసుకుంటాము.
- ఏ జోనర్ అయినా పర్లేదు అందులో ఎలాంటి నియమం లేదు
- మీ కథ/కవిత/కోట్ ఏదైనా పోటీ యొక్క లింక్ ద్వారా మాత్రమే ప్రచురణకు పంపవలసింది గా కోరుతున్నాం.
- పాల్గొనేవారు తమ స్వంత రచనలు (కథ/కవిత/కోట్) మాత్రమే పంపాలి .
- ఎన్ని రచనలైనా పంపచ్చు.
- ఇదివరకే స్టోరీ మిర్రర్ లో మీరు ప్రచురించిన రచనలు మళ్ళీ ప్రచురణకు పంపరాదు.
- స్టోరీ మిర్రర్ దే తుది నిర్ణయం
- వ్యాసాలు/ఆర్టికల్స్ పోటీ కి అంగీకరించబడవు.
బహుమతులు:
- 10 రోజులు పది రకాల కధాంశాల పైన రచనలు(కధలు లేదా కవితలు) ప్రచురించిన రచయితలకు పుస్తకం బహుకరించబడుతుంది.
- 30 రోజులు 30 కధాంశాల పైన కోట్స్ ప్రచురించిన రచయితలకు పుస్తకం బహుకరించబడుతుంది.
- 30 రోజులు విడువకుండా 30 కధాంశాల పైన రచనలు(కథ లేదా కవిత) ప్రచురించిన రచయితలకు స్టోరీ మిర్రర్ ట్రోఫీ అందజేయబడుతుంది.
- దయచేసి తేదీ ప్రకారం కధాంశాన్ని అనుసరించి రచనలు ప్రచురించండి.
- 10 రకాల రచనలు పది కధాంశాల పై ఒకే రోజు ప్రచురించినవి బహుమతి కి అర్హమైనవి కాదు.
- పది రకాల రచనలు ఒకే కధాంశం పై వేర్వేరు రోజులు ప్రచురిస్తే కూడా బహుమతి కి అనర్హమైనవి గా పరిగణిస్తాము.
- పాల్గొన్న వారందరికీ participation certificate ఇవ్వబడుతుంది.
అర్హత:
నాన్ స్టాప్ నవంబర్ - నవంబర్ 1,2019 నుండి నవంబర్ 30, 2019 వరకు
బహుమతి కి అర్హత పొందిన రచయితల పేర్లు డిసెంబర్ 20, 2019 న తెలియచేస్తాం.
రచన విభాగం : కవితలు /కథలు / కోట్స్(సూక్తులు)