పంతం నెగ్గింది
పంతం నెగ్గింది
మోహనరావు మంత్రిప్రగడ
On Tue, 15 Aug, 2023, 3:55 pm Mohan Rao MNAR, <mnarmohanrao@gmail.com> wrote:
మోహనరావు మంత్రిప్రగడ
పంతం నెగ్గింది.
ఆకాశంఅంతా నిర్మలంగా ఉంది. చుక్కలు చక్కగా తమ స్దానాలు అలంకరించాయి. చంద్రుడుకనపడి కనపడనట్లగాఉన్నాడు. చంద్రుడు కనిపిస్తాడేమోనని చంద్రమ్మ అదేపనిగా చూస్తోంది.మరికొంతసమయం అయింది, ఉన్నచంద్రుడుకూడా
మాయమైపోయాడు. చంద్రమ్మ నిరాశగా వెనుతిరిగింది. గుడిశకుచేరి మంచంమీద వాలింది.అసలుచంద్రుడు ఎమైపోయాడుచెప్పకుండా మాయమై పోయాడు. ఆలోచనలు చుట్చు ముట్టాయి. మూడు రోజులైయింది, ఎమైనట్లు, ఆలోచన తెగలేదు. కళ్ళు , మూతపడటం లేదు ఉత్తరాన్నచిన్న మెరపు మెరసింది. చంద్రమ్మ తలలో ఓ మెరపు మెరసింది. మూడురోజుల క్రితం తను చంద్రుడు, ఏటికాడ మాట్లాడు కొంటుంటే, ఆరాజుగాడు, రాముగాడు అటురావడం ఆతరవాత సంభాషణ అంతా కళ్ళ ముందు కదలింది.
"ఏరా చంద్రికకి లైనేత్తన్నావా"అడిగాడు రాజు. "అవున్రా మద్దెన నీకేటి బాధ" అన్నాడు చంద్రం కొపంగా. "ఎటీ నిజవా" యటకారంగా అడిగాడు రాము. అవున్రా, సూసీకో రేపే
మనీవాడేత్తాను" అన్నాడు కొపంగా చంద్రుడు. "ఏటి దోర పరమిషను లేకుండా మనువాడేత్తావా, అదెలా జరగుద్దో సూద్దాం"అన్నాడు రాజు. చంద్రుడు ఏదో అనబోయాడు, చంద్రమ్మ గమ్మున ఎదరకొచ్చి "మావా ఆగు ఆల్లతో మనకీపనేటీ నడు పొదాం" అంది. "ఓలబ్బ పౌరుషంకి తక్కవలేదు పిల్లకి, సూద్దాం ఈపెళ్ళి ఎలా జరుగుద్దో" అంటూ ముందుకి పోయారు, రాజు,రామడు.*
ఆసంగతే మళ్ళా మళ్ళా గుర్తు కొస్తోంది. గమ్మున లేచింది, బైటకి అడుగేసింది. అంతా కారుచీకటి, మళ్ళా ఒకఅడుగు వేన్కి వేసింది. అయనా ఇంతరాత్రేళ ఆముసల్దిన్ని బాధపెట్టడం ఎందుకు, పొద్దుగాలే పోతే బాగుంటదికదా, ఆలోచించింది. మళ్ళ నడుం వాల్చింది, స్దిరం లేదు ,ఎప్పుడు తెల్శార తుందాఅనిచూస్తోపడుకుంది,
సన్నగా వెలుగోచ్చింది. గబుక్కున లేచింది గబగబా మంగమ్మ ఇంటికి దారితీసింది. "ఒసే ముసలీ లెగిసావా," అరచింది, "ఏటే ఆగావుకేకలేంటి, అయనా పొద్దుగాలే తగలడ్డి నావేంటి, అచంద్రయ్య ఇసయంఏమైనా తెలిసిందా" అని అడుగుతు బైటకొచ్చింది మంగమ్మ. అందుకె వచ్చానే ముసలి" అంది చంద్రిక. "ఓలమ్మ ఓలమ్మ ఎడున్నాడే" అడిగింది మంగమ్మ. అసలు యిసయం ఇంకా తెల్లేదు, కాని ఆడు ఆరాముగాడు, రాజుగాడి కాడ ఉన్నాడనిఅనుమానం" అంది చంద్రమ్మ. "నీమొఖం ఆల్లకాడ ఎందుకుండాడే ఆడు" అని అడిగింది మంగమ్మ. "అంటే మొన్న నేను, చంద్రం రేవుకాడ మాట్టాడు కొంటంటే, అల్లక్కడికి ఆ ఎదవలు వచ్చారు" అని అక్కడజరిగిన విషయం అంతా మంగమ్మకి చెప్పింది. "అట్టాగ నిజమే ఆయదవలిద్దరు దాసేసి ఉండచ్చు, మరేంచేద్దాం" అడిగింది మంగమ్మ. "అదంతా నెసూసుకొంటాను, నువ్వు నెస్సెప్పినట్టు మాట్టాడు అంతె" అంది చంద్రిక. "అలాగేనేపిల్లా" అంది మంగమ్మ.
ఆతరవాత చంద్రిక పొద్దున్నే కడవ పట్టుకొని ఏటికి వెళ్ళిం. కడవ నీళ్ళల్లో ముంచి చంకనేట్టుకొని నిలబడింది. అటు కేసి వచ్చినరాముడు, చంద్రికను చూసి "ఏంటే పిల్లా ఈమధ్య చంద్రయ్య కనబడటం లేదు ఏడికైనా అంపావా" అడిగాడు. "నాను అంపడం ఏంటి, ఆడుఏడబోయాడో అయపు జాడా లేదు, అయనా నాతో మాటైన సెప్పకుండా పోయాడు," అంది. "అదేంటే ఆడు నువ్వు మనడుకోవాలనుకొన్నారు గందా, ఆడలా
సెప్పకుండా పోడంఏంటే, మరిఇప్పు డేలా" అడిగాడు రాజు. అదేంటి సామి అలాగంటావు, ఊళ్ళో మనశుల కరువా ఏంటి. నీలాంటోడు ఎవడో దొరక్కపోతాడ, చెప్పకుండ పోయినాడి కోసం ఎన్నాళ్ళు సూడాల, అసలు వత్తాడో లేదో తెల్దు అయనా ఇలా మొండి సేపలా ఒక్కత్తిని ఎలాపడుంటాను, నాకు వయసోచ్చింది కందా, ఏదో దారి సూసకోవాలి గందా" అంది వయ్యారంగా నిలబడి. రాముకి మతిపోయింది చంద్రమ్మ నిలబడ్డ తీరుచూసి. "చంద్రం ఇక్కడోద్దుకాని ఎవరైనావత్తారు, సాయంత్రం ముసలమ్మ ఇంటికాడకి వత్తాను, అక్కడ మాట్టాడ కొందాం" అని రాముడుసైకిలుఎక్కేసాడు.
చంద్రమ్మ గబగబా ఇంటికిచేరి "మసలి మసలీ" అని అరిచింది. "ఏంటే అలా అల్లాట ఆడతనావు ఏంటయిందీ" అని అడిగింది మంగమ్మ. "ఏటంటావేంటి, పిట్ట వల్లో పడ్డాదే" అంది ఇంకా సంతోషంగా. "ఏంటి ఏంపిట్టె అయతే ఈయాల పిట్ట మాసం కూరొండుతావా" అడిగింది మంగమ్మ. "నీమొకం, నేను వలట్టుకు పిట్టలు పట్టేదానిలాగున్నానా" అంది చంద్రం కొపంగా. "అదికాదే నూవ్వే అన్నావు పిట్ట పడిందని, మళ్ళా నామీద ఎగురాతావేంటి" అంది మంగమ్మగట్టిగా ."నీకసల బుర్ర లేదే ముసలి, నేను ఏపని
మీద తీరగతునాను, అది ఆడు ఆరాము గాడు నావల్లో పడ్డాడే, సందలడ్డాక మన ఇంటికి వత్తాడు. నువ్వ నేసెప్పినట్ట తల
ఆడించు, తేలిసిందా" అంది చంద్రమ్మ "అలాగేనే పిల్లా" అని తలాడించింది మంగమ్మ.
ఆసాయంత్రం బాగా పొద్దూ పోయాక రామడు మంగమ్మ ఇంటికి వచ్చాడు. "ఏమే మంగవ్వ నీమనవడి సంగతేమైన
తెలిసిందా" అడిగాడు, "లేదు బాబ సేప్ప పెట్టకుండ పోయాడు, నాబతుకు అంత అద్దాన్నం అయిపోయింది, ఇల్లిదిగో లీ చంద్రవే నాకు కాన్ని గంజినీళ్ళపోత్తనాది అంది. "ఇదిగో అవ్వ నేనోటీ అడగుతాను నువ్వు వప్పుకొంటే నిన్ను నానేత్తినేట్టుకు
సూసుకొంటాను"అడిగాడురామడు."దేనిగురింసిరా" అడిగింది మంగమ్మ. "అదేనే నీమనవడు మనవాడవలసిన సెంద్రాన్ని
నవ్వోప్పుకుంటే నేమనవాడతాను," అన్నాడు. "అదేంటిరా మనువా డవలసింది అదికదా, అదివప్పకొన్నాదా" అడిగాంది. పొద్దన్న ఏటికాడ కనబడిందే, నవ్వు బాధ పడతావేమో నని అందే" మద్దేన నాకు బాదేందిబాబ, మనువాడ వలసిన నామనవుడు, ఏడకీ పోయాడో తెల్దు, అసలు ఉన్నాడో లేదో తెల్దు ,రానోడి కోసం ఎన్నాళ్ళూ సూత్తది, దినికిట్టం అయతేమనువాడు కోండి నాయన" అంది మంగమ్మ. "సరే అలగైతే రేపు సందలడ్డాక
రిచ్చా అంపుతాను, నువ్వు, చంద్రం ఎక్కండి, ఆడు మిఇద్దర్ని పక్కూరులో నాకో ఇల్లుంది అక్కడ దింపుతాడు. ఆ యెనక నేనోత్తాను మనవడతాను, మీరు లక్కడే ఉందురుగాని, నీమనవడు లేడని బాద పడకు ఆడికన్న బాగా సూసుకొంటా" ,అని బరొసాఇచ్చాడు. "మంచిది బాబ అలాగే సానా సంతోషంగా ఉంది బాబ" అంది మంగమ్మ రామడు వెళ్ళిపోయాడు
"ఏందే ఆడు రిచ్చ అంటన్నాడు"అడిగింది మంగమ్మ.అవునేఆడురిచ్చాఅంపుతాడు. కాని మనని పక్కూరుకి తీసికెల్లడు ఆడు"
మనఇద్దర్ని తిన్నగ దోర బంగళాకి తీసుక పోతాడు. అల్లక్కడ నిన్ను కూకోపెట్టినన్ను దోరబంగళాలోకి తోసేత్తాడు, అంతేనువ్వు
అరగమీద పడి సచ్చిపోతావు , నాను లోపట ఇరుక్కుపోతాను, అది ఆడి పాను (ప్లాను)" అంది చంద్రమ్మ నవ్వతు. "ఏటే
ఆడంత గోరం చేత్తాడని తెలిసిన ఇంకా నవ్వుతున్నావెంటే" అడిగింది మంగమ్మ. "ఒలే ముసలి ఆడి పాను నాకు మందే తెలుసే, అందుకే నేను మరో పానేసాను అలాసూత్తావుండు ఏంజరుగుద్దో" అంది చంద్రమ్మ ధీమాగ."ఏంటో నీమాటలునాకేం
బుర్రకెక్కటంలేదే," అంది బుర్రగోక్కంటు. "నీకేటి అవసరంలేదవ్వా, నువ్వాలా కూకొని సూత్తాఉండు అంతే" అని లేచి తన కొంపకి వెళ్ళింది చంద్రమ్మ.ఆతరవాత మళ్ళా ముంగమ్మదగ్గరకొచ్చి అవ్వనువ్వు సేసిన సీపుర్లు ఎక్కడున్నయే అడిగింది. "లాములన్నాయి సూడు" అందిమంగమ్మ. చీపుర్లు తీసీకొని తను రోజు మగ్గంమీద పనిచేసే అరుణమ్మ ఇంటికి వెళ్ళింది. ఇక్కడో విషయంకివద్దాం చంద్రమ్మది ఈఊరు కాదు వేరేఊరు, చంద్రయ్య మీద మొజుపడి ఈఊరోచ్చి అతనింటి ప్రక్కగా ఓ ఇల్లు చూసుకు దిగింది. చంద్రయ్య నాన్నమ్మని కాకా పట్టి అక్కడకి కూడా వెడుతోంది. బ్రతుకుతేరవు కోసంఅరుణ మగ్గందగ్గర పనిచేస్తోంది, చంద్రమ్మ వాళ్ళ ఊళ్ళో మగ్గం పనే చేసేది తండ్రితో కలిపి.
చంద్రమ్మని చూసి అరుణ ఇంత పొద్దు గాలే వచ్చేవేందుకే చంద్రి" అడిగిందరుణ. "మంగ అవ్వకి బాగోలేదు, చీపుర్లు మీ ఇంటికాడ ఇచ్చి రమ్మంది తెచ్చాను"అంది చంద్రమ్మ. "అలాగ లాపంచలోఎట్టు," అంది అరుణమ్మ. చంద్రమ్మ ఇంకా అక్కడే
నిలబడుంది. "ఏంచంద్రం ఇంక ఈడె ఉన్నావు, ఏదైన పనుందా నాతో" అని అడిగింది అరుణ. "అక్క నేను నీకాడ సానా కాలంగా పనిచేత్తన్నాను కదక్క, కాని నీకోఇసయం సేపుతాను, నాకు నీ ఎల్పు (హేల్పు) కావాలి" అనిఅడిగింది. "అలగే సేంద్రి అడుగు" అంది అరుణ. "అక్క నాదసలు ఈవూరు కాదు ఏరేకాడ నించి చంద్రయ్య మీద మనసారేసుకుని ఈడకి వచ్చాను , ఆడు నేను మనువాడు కొందాం అనుకొన్నాం, కానక్క ఆడు గతనార్రోజలగ అయిపడటంలేదు, కానక్క ఆడ్ని ఎవరో అనపడకుండా సేసేసారని నాఅనుమనం, అని రేవూకాడ రాము, రాజుఅన్న మాటలు చెప్పింది. "అలాగంటావా నీకాఅనీమానం ఎందు కొచ్చిందే" అడిగింది అరుణ. "అక్క నిన్న లారాముడు రేవుకాడ అగపడి ఆడ్ని మనీవాడమని బలమంతం సేత్త న్నాడు.రాత్రికి రిచ్చా అంపుతాను, రెడి గుండు అన్నాడు" అంది చంద్రమ్మ. "అలాగ అయతె నేసేంసేయ్యాల" అడిగింది అరుణ. "ఏంలేదక్క నాకు లారాాముడు, రాజు లమీద అనుమానం గుందీ, దానికని నేనో పానేసా(ప్లాను) నీకురాజు ఇల్లు తెలుసుగందా, ఆడిని ఇక్కడకి రప్పించు, అప్పుడు సూడు ఎం జరూగుద్దో" అంది చంద్రమ్మ. "సరే" అని అరుణ తనకొడుకునిపంపింది. పదినిమి
షాల్లో రాజువచ్చాడు," అక్కరమ్మన్నవంట దేనికి" అడిగాడు, "ఏంలేదు తమ్మూడు మన సంద్రమ్మ ఉందికదా అది నీతో
ఏదో మాట్టడలంట లాగదిలో ఉంది నువ్వ మాట్టాడు, నేనీ గుమ్ళంకాడ కూకుంట ఎవరురాకుండా సూత్తాను" అంది అరుణ.
"ఏంటే మాట్టాడన్నవంట,పాపంచంద్రయ్య. కనబడంలేదంట కదా, మరెలాగే" అడిగాడు రాజు. "అదటుంచుసామి ఆడు కననబడ కుండా పోయిన కాడనించి నీ సావసగాడులారాము నాయంటపడి
ఆతన్ని మనువాడమని బలమంతం సేత్తిన్నాడు, నిదరరేత్రి (నిన్న) వచ్చి లామంగ అవ్వని అట్టుకొని నాను అతన్నీ మనువు ఆడమని సెప్పమని, అవ్వని నన్ను పువుల్లో ఎట్టుకు సూస కొంటాను అని తినేత్తన్నాడు, అక్కడకి మంగవ్వ అడగింది, నువ్వు చంద్రిని మనవాడితే లారాజు ఊరకొంటడా" అని అడిగితే "ఏడిసాడు ఆ ఎదవకి నాకు సాటేంటీ ఆడుగాని అడ్డోస్తే తలకాయ తీసేత్తాను" అన్నాడు, అంతేకాదు చంద్రయ్య కనపడక పోవడం యనక నీసేయ్య ఉండచ్చు అన్నాడు. అని ఇంకామరో నాలుగు తగిలించింది చంద్రమ్మ. దెబ్బకి రాజుకి మంటెక్కిపోయింది, "నాతో కూడా ఉంటనే నాయనక గొయ్య తీత్తన్నాడ ఎదవ" అన్నాడు కొపంగా. "అంతేకాదు సామి తనేలాగైన చంద్రయ్యని పట్టుకుంటానని ఆడిని ఆడి నాన్నమ్మని బైటకి అంపేసి నన్ను మనువాడేత్తాను, రాత్రికి రిచ్చా అంపుతాను ఎక్కమన్నాడు, ఆడు పక్క ఊళ్ళో దింపుతాడు, ఆయనక తనోచ్చి నన్ను మనువాడతా నన్నాడు. నాకు బయమయి నీకాడ కొచ్చినాను సామి" అంది బేలగా. "నవ్వేంబయపడకే ఆడి సంగతి నేసూసకొంటాను, రాత్రికి రిచ్చా వత్తే ఏదో సెప్పేసి ఎక్కకండి ఆతరవాత నేనోత్తాను, ఆడి సంగతి అక్కడే తేలుత్తా నువ్వేల్లు" అన్నాడురాజులేచి. "సామి మరోసంగతి, నాకు నువ్వంటేనే ఇట్టం మనువంటు ఆడితే నిన్నే ఆడతా, రాముడు సంగతి తేల్చేయి" అని ఓ ఓరచూపు విసిరింది, అంతే రాజ పడిపో యాడు. సరే నెఎల్తా అంటు ఆనందంగా బైటకి వెళ్ళిపోయాడు రాజు. "అక్క పిట్ట పడిపోయింది, ఇంక అంతా అదే జరిగిపోతంది" అని అరుణ చెయ్యట్టుకొని అక్క నీకు దండాలక్కా శానామంచీ సాయం సేసావు' అక్క నేను ఇంక నీకు
కనపడనక్కా ఇదే మన సివరి సూపులు నాను అనీకొన్నట్టు జరిగితే రాత్రికి రాత్రే సంద్రయ్య వచ్చేత్తాడు, మంగఅవ్వ ని తీసుకొని మాఊరు ఎల్లిపోతాం, గుర్తీంచు కొఅక్క అని కళ్ళమ్మట నీళ్ళెట్టు కొని మరో సారి అరుణ కి నమస్కారంపెట్టి బైటకి వచ్చేసింది చంద్రమ్మ.
చంద్రమ్మ బైటకొచ్చి సంతోషంగాఇంటి దారి పట్టింది. దారిలో ప్రశిడేంటుగారు కనిపించారు. "ఎతగబోయిన తీగకాలికి దగిలినట్టు ఈయన ఇక్కడే దోరికాడు" అని "దండాలండి పశిరెంటుగోరు" అంది. "ఏం చంద్రమ్మ బాగున్నావా, చంద్రయ్య యిసయం ఎమైన తెసిసిందా" అని అడిగాడాడు ఆయన. "లెదండి అయ్యగారు, నాకు మరో భాధ వచ్చిందండి దానిగురించీ తవర్ని కలుద్దామను కొని తమ ఇంటికాడికి వద్దామనీకొంటన్నాను,తవరే ఇక్కడ కనిపించారు"అందిచంద్రం"ఏవయిందమ్మా ఏంకట్టం వచ్చింది" అని అడిగాడు ఆయన. "అంటే అయ్యగారు- అని రాముడు రాజులు తననన మనువు ఆడమని బలమంతంసేత్తన్నారండి, రోజు రేవుకాడ, ఇంటికాడకివచ్చి బాద పెడతనారండ, తవరే నన్ను కాపాడాల" అని కళ్ళంమట నీళ్ళెట్టుకొంది. "అయ్యొ ఆఎదవలు అంతపని సేత్తిన్నార, నాకు బాదగానే ఉంది పిల్లా కాని ఆళ్ళు దొర మనుషలని ఆలోసిత్తన్నాను" అన్నాడు ఆయన. "అయ్యగారు తవరు ఏం సేయ్యద్దు, ఈసందాల ఆళ్ళిద్దరు నాకోసం మాఇంటికొత్తారు. ఆతరవాత ఆళ్ళ ఓకరితో ఒకరు తగవుపడతారు, జుట్టు అట్టుకొంటారు, ల్లప్పుడు తవరూ మరి
నలుగురూ పెద్దల్లీ యంటబెట్టుకొని దూరంగుండి సూడండి, ఆయనక వచ్చి ఆద్దర్ని పెద్దలముంగటే పట్టుకొని తీసక
పోయి లాదొరకాడ పంచాయితి ఎట్టి యిసయం సేప్పండి, మిగతా పని దోరే సూసుకొంటాడు, తమరికేం ఇబ్బంది ఉండదు" అంది "ఇదిబాగుందే మంచి ఆలోసనే అలాగే చేత్తాను" అని ప్రసిడేంటు
గారు వెళ్ళిపోయాడు.
కమల ఇంటిదగ్గర చంద్రమ్మమాటలు విన్నారాజుకి ఆరాము మీద పీకలదాకా కోపం వచ్చింది. దానికిసాయం చంద్రమ్మ
తనంటే ఇష్టంఅని చెప్పింది, దాంతో మనసు ఆలోచనలోపడింది. వెంటనే ఓ నిర్నయానికి వచ్చి, పొద్దుపొయేదాకా ఆగి వెంటనే చంద్రయ్యని బంధించిన చొటుకి వెళ్ళాడు, చంద్రయ్యని కలిసాడు, "ఒరే చంద్రం నెచెప్పిన దానికి నువ్వు వప్పు కొంటే నిన్ను వదిలేత్తారా" అనిఅడిగాడు. "ఏంచయ్యాలి చెప్పు" అడిగాడు చంద్రయ్య నిన్ను వదిలేత్తాను, నీవ్వు ఇంటికిపోయి నీనాన్నమ్మని తీసుకొని ఈఉరొదిలి పోవాల సంద్రమ్మని నాకు వగ్గియ్యల" అనిఅన్నాడు. చంద్రయ్యకి బాగా మండింది, కాని తమాయించు కొన్నాడు, ముందుబైట పడితే తరవాత చూడచ్చని "అలాగే" అన్నాడు. రాజు చంద్రయ్యని వదిలేసి కొంచంసేపు ఆగి చంద్రమ్మ ఇంటికి బయలుదేరాడు.
అంతకముందే రాము రిక్షా పంపాడు"రాయే ముసలి రిచ్చ వచ్చింది" అని అరచింది చంద్రమ్మ. "ఓలమ్మొ నాకు గుండేకాడ నెప్పి వత్తంది, నానుబతకనే గమ్మనరాయే" అని అరచింది మంగమ్మ ."ఓలమ్మ ఏవయిందే అంటు చంద్రమ్మ లోపలకి పరిగెత్తింది. మళ్ళా గబగబా బైటకొచ్చి "రిచ్చా అన్న మంగమ్మకి బాగోలేదు. కాన్ని ఉడకునీళ్ళు తాగింత్తాను, నవ్వు యెల్లి యిసయం రాముడికి సెప్పు" అంది. "అలాగేనమ్మా" అని రిక్షా అతను వెళ్ళిపోయాడు. "ఇదిగో ముసలి కాంచేపట్లో నీమనవడు అరత్తు వత్తాడు నువ్వు ఆడ్డ్ని అరవద్దని సెప్పి పంచలో ఉండి యిసయం అంతా సూడమను" అంది. "అలాగేనే" అని మంగమ్మ పంచలో మంచంమీద పడుకొంది. కొంతసేపటికి రాముడు వచ్చాడు, "ఏంటే మంగవ్వకి బాగోలేదా" అడిగాడు. "అవునయ్య ఉడుకు నీళ్ళట్టించాను పడకొంది" అంది. చంద్రమ్మ. సర్లే ఈయాలకొదిలయి రేపు మల్లా వత్తడులే రిక్షవాడు శిద్దంగుండండి
అన్నాడు, "ఏంటి ఉండేదిరా, ఇంతమోసం చేత్తవా, నాయనక తిరిగి నాకే యత్తు (ఎర్తు) యడతావా" కొపంగా అరచాడు అప్పుడే అక్కడకొచ్చిన రాజు. "ఏంట్రా మాట్టాడతనావు, నీకేంపని ఇక్కడ" అని బైటకొచ్చాడు రామడు, "నీకుమాత్రం ఇక్కడ పనేంటి తిరగేసాడు రాజు. "నేను చంద్రమ్మనిమనవాడతాను,అందుకొచ్చా
నీకేంటి పని" అని గట్టిగా అన్నాడు రాము "ఏంటి నువ్వూ సంద్రమ్మనిమనవాడతావా నే సూత్తో ఊరుకొవాల" మరింత గట్టిగా అరిచాడు రాజు. "లేపోతే ఏంసేత్తావురా" అన్నాడు రాము రాజు ముందుకొచ్చి. "ఏంట్రా మీదకొత్తన్నావు కొడతావా, నాసంగతి నీకు తెల్దునరికేత్తాను"అన్నాడు రాజు రామడి కాలరట్టుకొని. ఇద్దరు కలబడ్డారు, అంతవరకు దూరంనుండి
గమనిస్తున్న ప్రశిడేంటు, ఇతర పెద్దలు ముందుకొచ్చారు. "ఏరా ఏంట్రాఇది" అని అడిగారు ప్రశిడేంటుగారు. వాళ్ళని చూసి
రాము, రాజు అవాక్కయ్యారు. "ఒరే నేను అంత యిన్నాను, ఏంటి ఆచంద్రయ్య లేడని ఆపిల్లని యేదిత్తన్నారా ,ఒరేయి ఈల్లిద్దరిని సేతులు కట్టేసి తీసీకురండ్రా అని ప్రశిడేంటుగారు అన్నారు. "వెంటనే వాళ్ళిద్దరుతేరుకొని"మేందొరమనుషూలం తెల్దా" అరిచారు ఇద్దరు. "ఒరె బాబులు మిమ్మల్ని నేను ఆదొరకాడకే తీసుకుపోతా అక్కడే పంచాయితి పెడత, దొరే ఏసంగతి
తెలుత్తాడు ఒరే ఈల్లిద్దరీ సేతులు కట్టేసి తీసుకురండి" అన్నారాయన. అంతే అక్కడకి వచ్చిన పెద్ధలు వాళ్ళు చేతులు
కట్టెసి లాక్కుపోయారు.
అప్పటికే అక్కడకొచ్చిన చంద్రయ్య అంతా విన్నాడు. "ఏంటే చంద్రి ఈగొడవ ఏంటీ" అడిగాడు. "ఇదిగోమావ అదంతా
సెప్పె టైయిం లేదు ఆనక సెపుతా ముందు నీవ్వు నీ అవ్వ పెట్టట్టుకొ నేనాపెట్టట్టు కుంట, మనం యెంటనే యనకదార్న స్టేషనుకి యెల్లాల"అంది చంద్రమ్మ. ముగ్గురు బయల్దేరివెనకదారిని స్టేషను చేరారు. చంద్రమ్మ వెళ్ళి టిక్కేట్లు తేచ్చింది, కొంతసేపుతరవాతబండోచ్చింది మగ్గురుఎక్కేసారు. తెల్లారేసరికి బండి యలమందచేరింది ముగ్గురు దిగారు.. "ఏంటే సెంద్రి ఇక్కడ దింపావు, ఇది ఏఉరే అడిగింది మంగమ్మ. ఒలే ముసలి ఇది మాఊరే, ఈడనించే నాఆడకి వచ్చాను, నీమనవడికోసం, ఇంకె అడక్కు ఇంటికి యెల్లాక సెపుతా దగ్గరే నడు" అంది చంద్రమ్మ, ఆఉరుగురించి. సెంద్రయ్యకి. ముందేతెలుసు అసలు చంద్రమ్మ, తన కోసమే తన ఊరు వచ్చిందని తెలుసు అందుకే చిన్నగా నవ్వూతూ చంద్రమ్మ వెనక నడిచాడు.
కొంతదూరంనడిచాక చంద్రమ్మ ఇల్లు వచ్చింది, అరగుమీద కూర్చొన్న చంద్రమ్మ తండ్రి కూతుర్ని చూసి సంతోషంగా లేచి
"ఏందే తల్లి వచ్చావా" అనిఅడిగాడు. "వచ్చేసాం అయ్యా ఇదిగో నీకాడ శపదం సేసినట్టుగా నీఅల్లుడ్ని, ఆడి నాయనమ్మ
మంగమ్మని యెంటబెట్టుకొచ్చాను" అంది. "నమస్కారం అయ్య"అన్నాడుచంద్రయ్య, చంద్రమ్మ తండ్రితో, "మంచిదయ్య రండి
లోపలకి" అని అతని చేతిలో పెట్టి అందుకొని లోపలకి నడిచాడు అతను, ఆవెనక చంద్రయ్య, మంగమ్మ నడిచారు. మంగమ్మకేం అర్దంకావటం లేదు, తనమనవడు.కూడ అతనుముందే తెలుసున్నట్టు మాట్టాడేడు ఏంటో అంతా తికమకగా ఉంది, అను కొంటోంది మంగమ్మ. "అవ్వ, ఆయన నువ్వూ ఎల్లి మొకం కడుక్కు రండి, ఈలాగా నే టీ ఎట్టి తెత్తాను" అని లోపల్కి వెళ్ళింది చంద్రమ్మ.
"ఇదిగో మంగఅవ్వ, ఇది మాఇల్లు అల్లది మామగ్గం, మాఅయ్య మగ్గం నేత్తాడు, నీమనవడు ఆసీరలు అట్టుకెల్ల
డానికి వచ్చేవాడు, అప్పడే నీమనవడి మీద మనసడింది., ఓసారి మా అయ్య బైటకెల్లాక వచ్చాడు నీమనవడు, అప్పుడే కూకోబెట్టి ఇవరాలన్ని తెలుసుకొన్నాను, లాతరవాత మా అయ్యతో సేప్పినా, నీ మనవడిని మనువాడతానని, దానికి మాఅయ్య "ఓలమ్మి అయనేవరో ఎలాంటోడో ఏవూరో ఏంతేల్దుకదా, ఆయన వప్పు కుంటాడో లేదో తెల్దుకదా" అని అన్నాడు. "అయ్యా నామీద నమ్మకం ఉంచు నేనాడకెల్లి నేల తిరక్కుండా నీఅల్లుడ్ని యంట బెట్టుకోత్తాను, అని పంతం అట్టాను.అలాగే యంటబెట్టు కొచ్చాను.ఆయనక కధంతా నీకు తెలిసిందెకందా" అంది చంద్రమ్మ నవ్వుతు
ఆతవాత చంద్రమ్మ తండ్రి వాళ్ళిద్దరికి పెళ్ళిచేసాడు
యంతైన మొత్తానికి నీకూతురు పంతం నెగ్గించుకొచ్చింది పిల్ల మహాజాణ, అంది మంగమ్మ నవ్వుతు.
ఇక్కడ సంగతిలాఉంది. అక్కడ సంగతి చూద్దాం, ఆరాత్రికి రాజుని, రాముడిని పంచాయితిలో ఉంచి, ఉదయమే దొరదగ్గరకి తీసుకెళ్ళి విషయం అంతా చెప్పారు. దొర కోంతసేపు ఆలోచించి "ఈయదవలమూలంగా నాపరువు పోయింది, ఇలాంటోళ్ళు ఊళ్ళో ఉండకూడదు. ఈళ్ళిద్దర్ని లాకెళ్ళి ఊరి పొలిమేరల్లో వదిలేయండి. అని వాళ్ళవేపుచూసి మళ్ళా మీరిఉళ్లో కానికనిపిస్తే తుపాకితో కాల్చేస్తాను" అనికోపంగాఅనేసిదొర లోపలకెళ్ళిపోయాడు. వాళ్ళని లాక్కెళ్ళి ఊరిబైట వదిలేసారు, ఇద్దరుమారుమాట్టాడ కుండ తూర్పుకొకడు పడమర కొకడు పొయారు. పీడవిరగడైదనుకొని అందరు సంతోషించారు.
****************
.
