STORYMIRROR

Namith chandra k

Children Stories Inspirational

4  

Namith chandra k

Children Stories Inspirational

ఆచార్యదేవోభవ

ఆచార్యదేవోభవ

3 mins
477

తల్లిదండ్రుల తర్వాత మనం పూజించవలసినది గురువులే.ఒక ఊరిలో శ్రీను అనే ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు శ్రీను స్కూల్ లో ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేవాడు. అతను చాలా తెలివికలవాడు పాఠాలు చాలా బాగా చెప్పే వాడు అతను చెప్పింది ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒకసారి చదివితే ఇంకా మరిచిపోరు పిల్లలు. అతను పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలు అందరూ శ్రద్ధగా వినకపోతే అతనికి కోపం వచ్చి తరగతి నుండి బయటకు పంపించేవాడు. ఒకరోజు పాఠం చెబుతుంటే కిషన్ అనే ఒక అబ్బాయి మాట్లాడుతూ కనిపించాడు వెంటనే అతనిని నిలబెట్టి మీ నాన్న ఆరోగ్యం బాగాలేకపోయినా నీ కోసం మీ చెల్లి కోసం ఎంతో కష్టపడుతున్నారు. నువ్వేమో చదువు మీద శ్రద్ధ లేకుండా ఉంటే ఎలా అని మందలించి తరగతి నుండి బయటకు పంపించారు. బయటే నిలబడి పాఠం విను అని అంటాడు. అక్కడ తిరిగే వాళ్ళు అందరూ కిషన్ ని చూసి నవ్వుతూ ఉంటే అతను చాలా అవమానంగా భావించి మాస్టారు మీద కోపాన్ని పెంచుకుంటాడు. కిషన్ వాళ్ళ నాన్న అదే బడిలో టీచర్గా పనిచేస్తున్నారు. అతని కష్టసుఖాలను శ్రీనుతో పంచుకుంటాడు అప్పుడు శ్రీను చిన్నప్పుడు పడ్డ బాధ అనిపిస్తుంది.      ఒకరోజు శ్రీను బడి నుండి ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది కాలు పెరుగుతుంది ఈ విషయం తెలిసిన విద్యార్థులు టీచర్లు అందరూ చాలా బాధ పడతారు మాత్రం తన వల్లే ఇలా జరిగిందని సంతోష పడతాడు. ఒకరోజు కిషన్ వాళ్ళకి షేర్ ని తీసుకుని శీను మాస్టర్ ని చూడడానికి వెళతాడు అదే సమయంలో కిషన్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా మాస్టర్ ని చూడటానికి వస్తారు. వాళ్లందరూ శ్రీను మాస్టర్ తో ఆక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతుంటే అది నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఏమైందని వారందరూ ఓదారుస్తూ ఉంటే అతను చిన్నప్పుడు తన తనకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఏడుపొచ్చింది అని చెప్తాడు. ఏంటా సంఘటన అని అందరూ అడిగితే శీను మాస్టారు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మాది పల్లెటూరు మా అమ్మానాన్న లో పొలం పనులు చేసుకునే వారు. పొలంలో ధాన్యం పండితే నే మాకు తినడానికి తిండి ఉండేది వేరే ఆధారం ఏమీ లేదు. మా ఊరిలో ఒక చిన్న బడి ఉండేది నాకు ఉన్న చదువు మీద ఇష్టం వల్ల నేను బడికి వెళ్లి శ్రద్ధగా చదువుకునే వాడిని. కొన్ని రోజుల తరువాత పొలంలో జారిపడి మా నాన్నకి కాలు విరిగింది దాంతో పొలానికి వెళ్లలేక పోయేవాడు. అయినా సరే ఖాళీగా ఉండకుండా ఇంట్లో కూర్చుని బుట్టలల్లే వాడు. మా అమ్మ ఇంట్లో పని చేసుకుని పొలానికి వెళ్ళేది. మా అమ్మ కష్టాన్ని చూసి బడి మానేద్దాం అనుకున్నా కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. కష్టపడి చదువుతావు మంచి మార్కులు వస్తున్నాయి బడి మానేయద్దు అని అంది. నువ్వు మంచిగా చదివి మీ ఊరిలో ఒక పెద్ద స్కూలు కట్టించు అని చెప్పింది. హైస్కూల్ చదువు కోసం పక్క ఊరు వెళ్లి చదువుకోవాలి ఊరిలో వారికి ఆ ఇబ్బంది లేకుండా నువ్వు చెయ్యాలి అని అంది. నేను పొద్దున్నే లేచి ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ వేసేవాడిని ,మా ఇంట్లో ఆవులు ఉండేవి పాలు తీసి అందరికీ అమ్మి వచ్చేవాడిని, ఆ తర్వాత బడికి వెళ్లి వచ్చి ,పొలానికి వెళ్లి మా అమ్మకు సహాయం చేసేవాడిని రాత్రిపూట కూర్చుని లాంతరు వెలుగులో చదువుకునే వాడు అలా నా చదువు కొనసాగింది చదువుకొని ప్రభుత్వ ఉపాధ్యాయున్ని అయ్యాను. తర్వాత మా ఊరిలో స్కూల్ కట్టించాను. ఇప్పటికీ వారం వారం మా ఊరు వెళ్లి అక్కడ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని చూసి వాళ్లకు ఏమైనా సందేహాలుంటే తీర్చి వస్తాను. ఇప్పుడు నా తల్లిదండ్రులకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటున్నాను అందుకే మిమ్మల్నందర్నీ కూడా మంచిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్తాను. వాళ్ల తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడతారు వాళ్లకు కావాల్సింది మనం మంచి స్థాయికి రావడమే అది మనం సాధించి చూపించాలి అర్థమైందా పిల్లలు అని అడుగుతాడు. వెంటనే కిషన్ కళ్లనుండి నీరు గారి పోతుంటుంది. మాస్టారు కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మాస్టారు మీరు నన్ను తరగతి బయట నిలబెట్టినందుకు మీకు ఇలా అయిందని అనుకున్నాను కానీ మీరు మా మంచి కోసమే చెప్పారని అర్థం చేసుకోలేకపోయాను అంటాడు. అప్పుడు మాస్టారు మీ వయసు పిల్లలు అలాగే ఆలోచిస్తారు కానీ ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పటినుండి అయినా మంచిగా చదువుకోండి అని అంటాడు. ఆ తర్వాత పిల్లలందరూ బాగా చదువుకుని మంచి స్థాయికి వస్తారు. ఒక రోజు కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. అటువైపు నుండి కారులో వెళ్తున్న కిషన్ చూసి వెంటనే కారు దిగి వచ్చి మాస్టార్లు గుర్తుపట్టి తన కారులో హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేస్తాడు. మాస్టారికి మెలుకువ వచ్చి చూసి చాలా థ్యాంక్స్ బాబు నన్ను హాస్పిటల్కు తీసుకు వచ్చినందుకు అంటాడు. మీరు నాకు థాంక్స్ చెప్పవద్దు మీ వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు నేను కిషన్ ని అని చెప్తాడు. మీరు ఆ రోజు చెప్పిన మాటల వల్ల నేను బాగా చదివి డాక్టర్ అన్నయ్యను మాస్టారు అంటాడు. అని మాస్టారు కాళ్ళకి దండం పెడతాడు.ఆ మాటలకి శ్రీను మాస్టర్ చాలా సంతోషపడ్డాడు. నువ్వు ఈ స్థాయికి రావడం నాకు చాలా గర్వంగా ఉంది అంటాడు. మనకు విద్యాబుద్ధులు సంస్కారాన్ని నేర్పి విజ్ఞానాన్ని పెంపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు వందనం పాదాభివందనం.         

         గురువు కి అర్థం. 

గు అనగా విద్యార్థుల పట్ల గురుతరమైన బాధ్యత వహించు వాడు. రూ అనగా విద్యార్థుల లో ఉన్న రుగ్మతలను తొలగించు వాడు. వు అనగా ఉన్నత విద్యలో విలువలను పైకి తీయు వాడు. చదువు నేర్పే గురువు సంస్కారం నేర్పే గురువు విద్యార్థులకు ప్రేమ పంచేది గురువు దైవ సమాను డే గురువు.            

         ఆచార్యదేవోభవ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్