Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ప్రణతి

ప్రణతి

1 min
2

మత్తేభవిక్రీడితములు //

1. ధనగర్వంబున దుర్గుణంబు కలిగెన్ దండించి నన్నేలుమా!

ఘనమౌ కర్మలు చేయకుంటి వరదా !కాఠిన్యమున్ జూపకో!

వినయంబించుక లేనిదాన నధిపా!బేలన్ బరీక్షింపకో!

ప్రణతిన్ వేడితి తప్పులెంచకు హరీ!పాపంబులన్ బాపుమా!//

2. అనయంబున్ భజియించి కొల్చితిని నా యాధార మీవే కదా!

కునుకున్ దీయక నీదు నామములనే కూర్మిన్ సదా పల్కితిన్

వెనువెంటన్ జనుదెంచు వాడవనుచున్ వేదాత్మ కైమోడ్చుచున్

మనమందున్ నిను నిల్పితిన్ మురహరీ!మన్నించి నన్ బ్రోవుమా!//

3. కుదురౌ బుద్ధియె లేకపోయెను హరీ!కోల్పోతి సర్వస్వమున్

మదిలో కల్మషభావనల్ పెరిగె నా మార్గంబు వేరాయె నన్

బదిలంబొప్పగ కాచువాడవనుచున్ భక్త్యాత్మనై వేడుచున్ 

బదముల్ బట్టితి జూపుమా కరుణ నా ప్రారబ్దముల్ ద్రుంచుచున్ //

Rate this content
Log in

More telugu poem from Gayatri Tokachichu