మన ప్రభుత
మన ప్రభుత
1 min
216
మాయ మాటలతో చిన్ని చిన్ని తాయిలాల మూటలు
మత్తును ముంచే వేలాది మద్యపు దుకాణాలు
వెరసి జనులను వెర్రి వెధవలను జేసే ప్రక్రియలు
ఓ పౌరుడా తెలుసుకొని జనజీవన స్రవంతిలో వెలిగిపో
వేదన వత్తిడిల మధ్యన జన్మ నిచ్చే జననీ
జనుల మధ్యన జర్చే సజావుగా జీవించమని
కుల మత ప్రాంత విభేదాలు నడుమజచ్చే రాజనీతి
ఓ పౌరుడా తెలుసుకొని జనజీవన స్రవంతిలో వెలిగిపో
వద్దు వద్దు అంటే పథకాల ప్రలోభాలు
ఏ విధంగాను జీవన నైపుణ్యలను ఇవ్వని పనులు
ఓటుల వేటలే శోదనలు వెరసి వెర్రి వెంగప్పలే ప్రజలు
ఓ పౌరుడా తెలుసుకొని జనజీవన స్రవంతిలో వెలిగిపో
విద్యను ఖర్చుగా భావించే ప్రభుత్వాలు
వ్యాపార వేత్తలు దిగారు విద్యా రంగంలోకి
విషయ జ్ఞానం లేని ఉపాధ్యాయులతో
ఓ పౌరుడా తెలుసుకొని జనజీవన స్రవంతిలో వెలిగిపో