యుగాలు దాటినా ఉగాదులు మారినా
మానవ పునాదులు మాత్రం మారునా!
ఆరు రుచుల ఆహారం ఉగాది
యెన్నో అభిరుచుల ఆహార్యం ఉగాది
ఓ గురువర్యా!
మట్టి బుర్రకు మకిలి కడిగేది నీవే
మెరుగు పెట్టేది నీవే
గురువు యెన్నో జీవితాలకు
నీడనిచ్చే తరువు
ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్య
మానవునికి వికాసాన్నిచ్చేది ఆచార్య
ఒక్క నీటి బొట్టు చాలు గొంతు మంట చాల్లార్చెందుకు
ఒక్క నిప్పు రవ్వ చాలు కార్చిచ్చు రగిల్చేందుకు
ఓ భైరవ
ఎన్ని రుపాలున్న మరెన్నో
నామాలున్నా నువ్వు దేవుడువువే కదా
మరి నాకెన్ని గుణాలున్న నేనూ మనిషినే కదా
జీవితాన్ని ఆసాంతం అంగీకరించు ప్రతి అనుభూతిని ఆస్వాదించు
ప్రేరణ పొందాలన్న తపన ఉంటే చాలు సృష్టిలో ప్రతి వస్తువు ఇస్తుంది..ప్రేరణ