చూస్తే బయట వాతావరణం ప్రశాంతంగానే ఉంది,
నా గదిలో మాత్రం తుఫాన్ కల్లోలం కొనసాగుతోంది.
©Santhosh
వదిలేసిన అవకాశం,
గడిచిపోయిన సమయం,
తిరిగిరావు.
మనసు:
సంతోషంలో మంచి మిత్రుడు,
బాధలో చెడ్డ శత్రువు.
నిజం ఎప్పుడు
నమ్మడానికి కష్టంగా,
చెప్పడానికి భయంగా ఉంటుంది.
ఒక పుస్తకం చదివి చూడు,
ఒక జీవితాన్ని అర్ధం చేసుకోగలవు.
చిన్న చిన్న సరదాలు
అవే ఎప్పటికి మరుపురాని
తీపి జ్ఞాపకాలు
భగవంతుడు:
గమ్యాని చూపించకుండా,
గమ్యస్థానన్ని నిర్ధేశించేవాడు.
రచయిత :
మరో ప్రపంచ రూపకర్త
చావు:
దీని పరిచయం ప్రపంచానికి
దూరం చేస్తుంది,
ప్రశాంతత కు
దగ్గర చేస్తోంది.