మన జీవితంలో మనం చేసే మంచి చెడులే....
మనకి జ్ఞాపకాలు ( మంచివైనా - చెడువైనా )
అలాగే గౌరవం - అగౌరవం, కీర్తి - అపకీర్తి , ప్రతిష్ట - అప్రతిష్ట
అనే పదాలను పరిచయం చేసి సమాజంలో ఒక స్థాయిని కల్పిస్తాయి...
అలాగే వాటికి మనలను బానిసలను చేస్తాయి....
ఏకాగ్రత లేకుండా ఉండదు కళ
ఆలోచన లేకుండా ఉండదు కల
ఆ రెండూ లేకుండా ఉండదు జీవిత కథ.
నీ ఆలోచన నీకు ధైర్యం, ఆత్మస్థైర్యం కలిగేలా ఉండాలి,
నలుగురిలో నిన్ను ప్రత్యేకంగా చూపించాలి,
అప్పుడే నీవు సమాజానికి ఆదర్శంగా నిలుస్తావు
క్రమంగా నిన్ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతోంది.