ప్రేమ ఎంతో పవిత్రమైనది, స్వచ్ఛమైనది. స్పర్శతోనే తెలిసిపోతుంది. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డ సైతం, ఒక్క స్పర్శతోనే అమ్మ ప్రేమని ఆస్వాదిస్తుంది. సమస్త జీవరాసులు వాటి ధర్మానికి, గుణానికి అనుగుణంగా ప్రేమకు కట్టుబడి ఉంటాయి. మనం పుట్టిన దగ్గరనుంచీ, చనిపోయేవరకు ప్రతి అడుగులో వెన్నంటి ఉండేది ప్రేమ. ప్రేమ బదులు కోరేది కాదు, ఆశించేది కాదు, ఒకరికి ఇచ్చేది మాత్రమే...